క్వీన్ కంగన రనౌత్ ఎక్కడ ఉంటే వివాదం అక్కడ ఉంటుంది. ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత వివాదాస్పద రియాలిటీ షో `లాక్ అప్`తో మంటలు పుట్టించే పనిలో ఉంది. కంగన షో దెబ్బకు ఘర్షణలు చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక లాక్ అప్ షో కోసం ఇప్పటికే కంగన బోలెడంత రాద్ధాంతం చేస్తోంది.
ప్రచారాన్ని హోరెత్తించేందుకు తెలివైన ఎత్తుగడలను అనుసరిస్తోంది. తాజాగా ఈ రియాలిటీ షో అంతర్యాన్ని బయటకు చెప్పేసింది. వలువలు వలిచి పందేరం పెట్టే షో ఇది! అంటూ కంగన స్వయంగా హింట్ ఇచ్చేయడంతో రైట్ వింగ్ భాజపా కు అస్సలు నచ్చలేదు.
రైట్ వింగ్ సిద్ధాంతాలకు మద్దతు ఇస్తూ అధికారంలో ఉన్న బిజెపికి కంగన అన్నివేళలా అండగా నిలిచింది. కానీ ఇప్పుడు రియాలిటీ షో వల్ల వారికి దూరమవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ షో నియమనిబంధనలు పూర్తిగా రైట్ వింగ్ కి మింగుడుపడనివి. దీంతో కంగనపై గుర్రుమీదున్నారని తెలుస్తోంది. క్వీన్ ఎప్పుడూ స్వరా భాస్కర్ - తాప్సీ పన్ను వంటి ఉదారవాద నటీమణులపై విరుచుకుపడుతూనే ఉంది. అలాగే ఇండస్ట్రీ మాఫియా బాధితురాలిగా తనపై సింపథీని వర్కవుట్ చేసుకుంటోంది.
ఇప్పుడు ఏక్తాకపూర్ లాంటి గట్సీ నిర్మాతతో కలిసి లాక్ అప్ పేరుతో ఓటీటీ షో చేస్తోంది. ఇది ఆద్యంతం హీట్ పెంచే షో. ఇందులో పూనమ్ పాండే.. అందచందాల వలలు కుర్రకారుకు కంటిమీద కునుకు పట్టనిచ్చే ప్రసక్తే లేదన్న టాక్ నడుస్తోంది. ఈ షోలో మరొక వివాదాస్పద నటి కనిపించనుంది.
హిందూ దేవుళ్ళను అవమానించిందనే ఆరోపణలపై జైలులో గడిపిన టీవీ సెలబ్రిటీ మునావర్ ఫరూకీ ఇందులో స్పెషల్ ట్రీటివ్వనుందన్న వార్తతో భాజపా రైట్ వింగ్ చెలరేగుతోంది. సాధారణంగా ఈ తరహా విచ్చలవిడి అభ్యర్థులను రైట్ వింగ్ క్షమించదు. ఇప్పుడు కంగనా వారికి మద్దతు ఇస్తుండటం వారిని చికాకు పెడుతోంది.
ఈ షో మొత్తం 16 మంది పోటీదారుల పేర్లు బయటకు వస్తే ఇంకెంత గందరగోళం కనిపిస్తుందోనన్న డౌట్స్ ఉన్నాయి. కంగనకు మునుముందు రాజకీయ ప్రత్యర్థుల వల్ల జింతాతే అన్న టాక్ వినిపిస్తోంది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 27న ఓటీటీలో ప్రసారం అవుతుంది.