తాజాగా బాలీవుడ్ ఫిల్మ్ ఫేర్ అవార్డులను ప్రకటించిన విషయం తెల్సిందే. గల్లీ బాయ్ చిత్రం ఏకంగా 13 అవార్డులను దక్కించుకుంది. దాంతో ఫిల్మ్ ఫేర్ జ్యూరీపై విమర్శలు వస్తున్నాయి. ఫిల్మ్ ఫేర్ జ్యూరీ సభ్యుడిగా కరణ్ జోహార్ ఉండటంతో ఆయనపై కంగనా సిస్టర్ రంగోలీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఫేక్ అంటూ మరోసారి నిరూపితం అయ్యిందని ఆమె ఆరోపించింది. తన సోదరికి అవార్డు రాకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేసింది.
కరణ్ జోహార్ లాంటి వారు జ్యూరీలో ఉన్నప్పుడు ఇలాంటివే జరుగుతాయంది. ప్రస్తుతం కరణ్ జోహార్ రూపొందిస్తున్న తఖ్త్ సినిమాకు కూడా అవార్డులు ఇప్పించుకోవాలంది. సినిమా విడుదల కాకుండానే అవార్డులు ఇచ్చుకోండి అంటూ కరణ్ కు రంగోలీ పంచ్ వేసింది. కంగనా రనౌత్ ‘మణికర్ణిక’ చిత్రంలో అద్బుతమైన నటన కనబర్చినా కూడా ఎందుకు తనకు అవార్డును ఇవ్వలేదంటూ కంగనా ప్రశ్నిస్తుంది. ఫిల్మ్ ఫేర్ అవార్డులు అనేవి మరోసారి ఫేక్ అంటూ తేలిందని ఆమె ప్రకటించింది.
అనన్య పాండేకు కూడా డెబ్యూ హీరోయిన్ అవార్డు ఇవ్వడంను ఆమె తప్పుబట్టింది. కరణ్ జోహార్ పూర్తిగా అన్యాయపూరితంగా అవార్డులను ప్రకటించాడు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఆలియా భట్ కు వచ్చిన బెస్ట్ హీరోయిన్ అవార్డుకు ఆమె అర్హురాలు కాదంటూ కంగనా సిస్టర్ పేర్కొంది. ఇక గల్లీబాయ్ చిత్రంకు అన్ని అవార్డులు రావడం పట్ల అనుమానాలు ఉన్నాయంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.