రాజమౌళి గురించి కీరవాణి అసలేం రాశాడు?

Update: 2017-03-28 08:59 GMT
ఎప్పుడు నవ్వుతూ లేదా గంభీరంగా కనిపించే రాజమౌళి.. తొలిసారిగా ఓ పబ్లిక్ ఫంక్షన్లో ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టేసుకున్నాడు. ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి ఎమోషనే హైలైట్. జక్కన్నను అలా చూడటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఎప్పుడూ తనతోనే ఉండే.. తనను అంతగా పొగడని అన్నయ్య.. తన గురించి ఇంత శ్రద్ధపెట్టి.. తనకు తెలియకుండా ఓ పాట రాయడం.. దాన్ని అంత పెద్ద ఈవెంట్లో కోట్లాది మంది చూస్తుండగా పాడి తనను వేదిక మీదికి ఆహ్వానించే సరికి రాజమౌళి ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. అసలింతకీ రాజమౌళి గురించి కీరవాణి అసలేం రాశాడు.. ఏమని పాడాడు.. ఆ లిరిక్స్ ఎలా ఉన్నాయి..?

‘బాహుబలి’ తొలి భాగంలో వచ్చే ‘ఎవ్వడంట ఎవ్వడండ..’ పాట స్ఫూర్తితో కీరవాణి జక్కన్న కోసం తయారు చేసిన పాట ఎలా సాగుతుందంటే..

‘‘ఎవ్వడంట ఎవ్వడంట బాహుబలి తీసింది
మా పిన్నికి పుట్టాడు ఈ నంది కాని నంది
శివుని ఆన అయ్యిందేమో హిట్టు మీద హిట్టు వచ్చి ఇంతవాడు అయ్యిందీ
పెంచింది రాజనందిని కొండంత కన్న ప్రేమతో..
ఎంతెంత పైకి ఎదిగినా అంతంత ఒదుగువాడిగా..
చిరాయువై యశస్సుతో ఇలాగే సాగిపొమ్మని..
పెద్దన్న నోటి దీవెన శివుణ్ని కోరు ప్రార్థన’’
ఇదీ రాజమౌళికి కీరవాణి అందించిన అక్షర నీరాజనం.

Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News