మరోసారి నెటిజన్స్‌ కు కౌంటర్‌ ఇచ్చిన డాటర్‌ ఆఫ్‌ రహమాన్‌

Update: 2020-11-10 04:45 GMT
ఇండియాస్‌ మోస్ట్‌ ఫేమస్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రహమాన్‌ కూతుర్లు ఇద్దరు కూడా ఎప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతూ ఉంటారు. ఆయన ఇద్దరు కూతుర్లలో ఒకరు రహిమ రహమాన్‌ కాగా మరొకరు ఖతిజ రహమాన్‌. వీరిలో ఖతిజ తన మొహం చూపించకుండా ముస్లీం సాంప్రదాయం ప్రకారం బుర్ఖా ధరిస్తూ ఉంటారు. ఇక రహిమ రహమాన్‌ తన మొహం దాచుకోకుండా మీడియాలో సందడి చేస్తూ ఉంటారు. నటిగా ఎంట్రీ ఇచ్చేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఖతిజ ఇంకా బుర్ఖా వెనుకాలే ఉండటంపై చాలా మంది చాలా రకాలుగా విమర్శలు గుప్పించారు. రహమాన్‌ ను కూడా కూతురు విషయంలో ఇలా వ్యవహరించడం ఏంటీ అంటూ కొందరు ట్రోల్స్‌ చేశారు.

పలు సందర్బాల్లో ఖతిజ స్పందిస్తూ ఇది నాకు నేను తీసుకున్న నిర్ణయం. నా ఇష్టపూర్తిగా నేను నా మనసుకు నచ్చింది అనిపించింది చేస్తున్నాను. ఎందుకు దీన్ని కొందరు విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఈమె ఫరిస్టోన్‌ ద్వారా గాయినిగా పరిచయం అయ్యింది. రహమాన్‌ సహకారంతో ఖతిజ పాడిన పాటకు మంచి స్పందన వస్తుంది. ఈ సమయంలో మరోసారి ఆమె ముసుగు విషయంలో విమర్శలు వస్తున్నాయి.

తన ట్యాలెంట్‌ కు ముసుగుకు ఏమైనా సంబంధం ఉందా అంటూ తాజాగా ఒక జాతీయ మీడియాతో మాట్లాడిన సందర్బంగా అసహనం వ్యక్తంచేసింది. ముసుగులో ఉన్నంత మాత్రాన కాన్ఫిడెన్స్ తో లేను అనుకోవడం పొరపాటు. నాకు నేను చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను అనే విషయం తెలుసు. నన్ను ఫిజికల్‌ గా చూపించుకోవాలని నేను ఎప్పుడు అనుకోవడం లేదు. నా నమ్మకాలు నాకు ఉన్నాయి. వాటి గురించి ఇతరుల వద్ద చెప్పలేను. అందరిలా బ్యూటీ ఫేస్‌ చూపించి నేను కెరీర్‌ లో ముందుకు వెళ్లాలని నేను అనుకోవడం లేదు. ఎవరి పని వారు చేసుకుంటే బాగుంటుంది అంటూ తన ముసుగుపై ట్రోల్స్ చేస్తున్న వారికి కౌంటర్‌ ఇచ్చింది.
Tags:    

Similar News