యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ 'ఆదిపురుష్' ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 'బాహుబలి'గా ప్రపంచ వ్యాప్తంగా అలరించిన ప్రభాస్ ఇప్పుడు ఆది పురుషుడు రాముడిగా అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రభాస్ కెరీర్లో 22వ సినిమాగా రానున్న 'ఆది పురుష్' ప్రాజెక్ట్ కి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నారు. 'చెడుపై మంచి సాధించిన విజయం' అనే కాన్సెప్ట్ పోస్టర్ ను ప్రభాస్ అభిమానులతో పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్ పై ప్రభాస్ అభిమానులే కాకుండా అతని పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా భారీ అంచనాలే పెట్టుకున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ.. ''ప్రధాని నరేంద్ర మోడీ ఈ మధ్యనే అయోధ్యలో రామాలయ శంకుస్థాపన చేశారు.. రాముడి కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్నారు.. ఇలాంటి టైంలో ఈ సబ్జెక్టుని తెరపైకి తీసుకురావడం చాలా గొప్ప విషయం. ప్రపంచం మొత్తం ఆశ్చర్య పోయేలా ఈ చిత్రాన్ని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు'' అని పేర్కొన్నారు.
కృష్ణంరాజు మాట్లాడుతూ.. ''ఆదిపురుష్ అంటే విష్ణుమూర్తి ఒక అవతారం. సోసియో ఫాంటసీ కథతో భారీ ఎత్తున ఈ సినిమాని తీయాలని సంకల్పించారు. ప్రభాస్ ఈ స్టోరీ వినగానే చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఈ సినిమా కథ నేను కూడా విన్నాను. ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా అవుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా పెట్టడం వల్ల గొప్ప సినిమా కావడానికి అవకాశం ఉంది. ఈ సినిమాకి దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ ఉండబోతుంది. ఈ సినిమాని ఇండియాలో కేవలం నాలుగు భాషల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళాలి అనుకున్నా. ఇప్పుడు 'ఆదిపురుష్' సినిమాతో హాలీవుడ్ రేంజ్ హీరో అనిపించుకుంటాడు. ప్రభాస్ ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది'' అని చెప్పుకొచ్చారు.