మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. క్రాక్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం రాజాలో కొత్త ఊపు తెచ్చింది. ఫ్లాపులు ఎదురైనా ఇప్పుడు మాస్ రాజాకు ఎదురు లేదు. తన తదుపరి చిత్రం 'ధమాకా'ను డిసెంబర్ లో విడుదల చేయనున్నారు. అలాగే స్టూవర్డ్ పురం దొంగ కథతో టైగర్ నాగేశ్వరరావు,... సీరియస్ యాక్షన్ డ్రామా కథాంశంతో రావణాసురుడు చిత్రాలు చేస్తున్నాడు. చిరు వాల్టెయిర్ వీరయ్యలో ను ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడు. రానున్న ఆరు నెలల్లో మాస్ మహారాజా నుంచి విజువల్ ఫెస్టివల్ ని ఆస్వాధించేందుకు మాస్ ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.
తాజా సమాచారం మేరకు.. రవితేజ ప్రస్తుతం పోలాండ్ లో స్టైలిష్ యాక్షన్ చిత్రం షూటింగ్ లో ఉన్నాడు. ఈ చిత్రానికి DOP నుండి దర్శకుడిగా మారిన కార్తీక్ తెరకెక్కిస్తున్నారు. రవితేజ ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ -ఏక్ మినీ కథ ఫేమ్ కావ్య థాపర్ తో రొమాన్స్ చేయనున్నట్లు సమాచారం.
మరికొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలతో అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రేక్షకులను అలరించడానికి మాస్ రాజా స్పీడ్ పెంచడం చూస్తుంటే ఈ దూకుడు ఇప్పట్లో ఆగేట్టు లేదు. అతడు తిరిగి మార్కెట్లో పుంజుకున్నాడు.
ధమాకాతో గురి పెట్టాడుగా...!
'ధమాకా' నుంచి ఇప్పటికే టీజర్ గ్లిమ్స్ వైరల్ గా దూసుకెళ్లింది. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ధమాకా ప్రొడక్షన్ పనులు పూర్తి కావస్తుండగా విడుదలకు సిద్ధమవుతోంది. టీమ్ ఇప్పటికే విడుదల చేసిన పాటలు.. టీజర్ .. పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ప్రచారంలో ఇప్పటికే వేగం పెంచారు.
వినాయక చవితి స్పెషల్ గా ఈ రోజు ఒక రొమాంటిక్ గ్లింప్స్ ను విడుదల చేయగా...పెళ్లిలో శ్రీలీలతో రాజా రొమాంటిక్ టింజ్ ఆకర్షించింది. రవితేజ యూత్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. రొమాంటిక్ గ్లింప్స్ యూత్ కి అంతే ఇదిగా కనెక్టయిపోయింది. మొత్తానికి అదిరిపోయే రొమాన్స్ తో రవితేజ మరోసారి రక్తి కట్టించబోతున్నాడని అర్థమవుతోంది. టీజర్ లోను రాజా ఎనర్జీ ఎక్కడా తగ్గలేదని ప్రూవ్ అయ్యింది.
పీపుల్స్ మీడియా పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మునుముందు ప్రచారం పరంగా మరింత జోరు పెంచనుంది టీమ్. ఇక వరుస చిత్రాలతో దూసుకొస్తున్న మాస్ రాజాకు కెరీర్ బెస్ట్ సీజన్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.