పుస్తకాలు చేతపట్టుకొని కాలేజీకి వెళ్లే కుర్రాడి పాత్రలో మహేష్ ని చూడక చాలా రోజులైంది. `యువరాజు`, `ఒక్కడు`, `సైనికుడు`లాంటి చిత్రాల్లోనే ఆయన స్టూడెంట్ గా కనిపించాడు. ఆ తర్వాత మళ్లీ కాలేజీ వైపు వెళ్లలేదు. కానీ `శ్రీమంతుడు`లో మాత్రం మహేష్ బాబు కాలేజీ సన్నివేశాల్లో కనిపిస్తాడట. మరి మహేష్ సినిమాలో స్టూడెంట్ గా కనిపిస్తాడా? లేక కాలేజీకి వేరే పనిపైన వెళతాడా? అన్నది తెరపైనే చూడాలి. శ్రుతిహాసన్ మాత్రం సినిమాలో ని కొన్ని సన్నివేశాల్లో స్టూడెంట్‌గానే కనిపిస్తుందని సమాచారం. కాలేజీలో శ్రుతిహాసన్‌తో మహేష్ బాబు చేసే సందడి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటిదాకా వచ్చిన టీజర్స్‌నీ, సాగుతున్న ప్రచారాన్నీ బట్టి చూస్తే `శ్రీమంతుడు`లో మహేష్‌బాబు ఓ ఎన్నారైగా, కోట్లకు పడగలెత్తిన ధనవంతుడిగా కనిపిస్తాడు. తన దగ్గర లేనిదంటూ లేదు అనిపించేంత రిచ్‌గా ఉంటాడు. కానీ తనకి ఇంకేదో కావాలనిపించడంతో సొంతూరుకి బయల్దేరి, ఆ ఊరిని దత్తత తీసుకొంటాడని తెలుస్తోంది. ఆ దత్తత నేపథ్యంలోనే మిగతా కథంతా సాగుతుందని సమాచారం. `మిర్చి` తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రం `శ్రీమంతుడు`. భారీ అంచనాల మధ్య ఆగస్టు 7న సినిమా విడుదల కాబోతోంది. రేపే పాటలు విడుదల కాబోతున్నాయి. ఆ వేడుకలోనే ట్రైలర్‌ని విడుదల చేస్తారు. ఆడియో విడుదల వేడుకలో హంగామా కోసం 2 నిమిషాలు ట్రైలర్‌తోపాటు, 4 పాటలతో కూడిన టీజర్లను కట్ చేశారట. ఆ ట్రైలర్ చూస్తే మహేష్ పాత్ర ఏంటో మరింత బాగా అర్థమవుతుంది.