తమిళ్ స్టార్ హీరో సూర్య- అసిన్ జంటగా మురగదాస్ తెరకెక్కించిన గజిని అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. ఇందులో నయనతార కూడా ఓ కీలక పాత్ర పోషించింది. మురగదాస్ కి దర్శకుడిగా మూడవ చిత్రం. డైరెక్టర్ గా ఎదుగుతున్న సమయం కూడా అదే. అటు నయనతార కథానాయికగా నిలదొక్కుకొనే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆ సినిమా రిలీజ్ అయిన కొన్నాళ్లకి నయన్ డైరెక్టర్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసింది. గజనీలో ఆ పాత్రకు సంతకం చేయడం తాను తీసుకున్న అతి చెత్త నిర్ణయమని.. కథ నరేషన్ సమయంలో చెప్పిన విధంగా తన పాత్రను తెరపై చూపించలేదని ఆరోపించింది.
గజినీ ఫోటోగ్రపీ కూడా ఏమంత బాగాలేదరని వ్యాఖ్యానించింది. అయినా ఈ విషయంపై ఎవరికీ ఫిర్యాదు చేయలేదని సెటైర్లు వేసింది. కానీ వీటిపై ఏనాడూ మురగదాస్ స్పందించలేదు. తాజాగా ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా.. నయనతార హీరోయిన్ గా తెరకెక్కించిన దర్బార్ రిలీజ్ ప్రచారంలో భాగంగా తమిళ మీడియాని చుట్టేస్తున్నాడు. ఈ సందర్భంగా నయన్ తో వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. తన పాత్ర నచ్చింది లేదా నచ్చలేదు అన్న కారణంగా వారి పాత్రను పెంచను... తగ్గించను. కొన్ని సార్లు మాకు నచ్చని స్టార్లకు కూడా పాత్రలు ఇస్తాం. అలాగే మా అభిమాన నటులకు చిన్న పాత్రలు ఇవాల్సి వస్తుంది. అది మా చేతుల్లో లేదు.
నటీనటులు.. వారిపై ఉన్న వ్యక్తి గత కారణాలతో స్క్రిప్టులో మార్పులు చేయం. నా దృష్టిలో స్క్రిప్టు రెడీ అయ్యాకే హీరో సహా మైండ్ లోకి ఇతర పాత్రధారులు వస్తారు. అప్పుడే ఎవరు ఏ పాత్ర చేస్తే బాగుంటుందని డిసైడ్ అవుతా. ఆ విషయంలో ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. నేనొక క్రియేటర్ ని అని సమాధానం ఇచ్చారు మురుగ.