'కాళిదాసు'తో మొదలుపెట్టాడు.. తర్వాత కరెంట్ అన్నాడు. ఆపై 'అడ్డా'తోనైనా సక్సెస్ కొడదామని చూశాడు. కానీ ఏదీ ఫలితాన్నివ్వలేదు. మూడు సినిమాల తర్వాత కూడా సక్సెస్ కోసం ఎదురు చూపులు తప్పట్లేదు నాగార్జున మేనల్లుడు సుశాంత్‌కు. సినిమా సినిమాకు విరామం తీసుకుని చాలా కసరత్తు చేస్తున్నా ఫలితం ఉండట్లేదు. ఇప్పటిదాకా కొత్త దర్శకుల్నే నమ్ముకున్న సుశాంత్ ఈసారి ఓ సక్సెస్ఫుల్ దర్శకుడిపై కన్నేశాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మేర్లపాక గాంధీపై కర్చీఫ్ వేశాడు. ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఖాయమని.. సొంత బేనర్ శ్రీనాగ్ కార్పొరేషన్లోనే సుశాంత్ సినిమా చేస్తాడని వార్తలచ్చాయి.
కానీ ఏమైందో ఏమో కానీ.. ఈ సినిమా కోసం చాన్నాళ్లు టైం స్పెండ్ చేసిన గాంధీ ఉన్నట్లుండి ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. యువి క్రియేషన్స్‌లో శర్వానంద్‌తో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ఈ నెల్లోనే ఆ సినిమా మొదలు కానుంది. మేర్లపాకతో ఎక్కడ తేడా వచ్చిందో కానీ.. సుశాంత్ నాగేశ్వరరెడ్డితో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. దేనికైనా రెడీ, కరెంటు తీగ సినిమాలతో వరుసగా రెండు సక్సెస్‌లు కొట్టిన నాగేశ్వరరెడ్డి మళ్లీ మంచు ఫ్యామిలీతోనే సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ.. ముందు సుశాంత్‌కు కమిటయ్యాడు. వరుసగా రెండు రీమేక్ సినిమాలతో హిట్లు కొట్టిన నాగేశ్వరరెడ్డి.. సుశాంత్ కోసం సొంత కథ రెడీ చేశాడట. మంచు ఫ్యామిలీని స్లంప్లోంచి బయటపడేసిన నాగేశ్వరరెడ్డి.. నాగ్ మేనల్లుడికి కూడా తొలి సక్సెస్ అందిస్తాడేమో చూడాలి.