నేనే రాజు నేనే మంత్రికి ట్రాజెడీ క్లైమాక్స్

Update: 2017-08-08 07:34 GMT
రానాకి సోలో హిట్ తీసుకురావాలనే ఉద్దేశంతో దగ్గుబాటి కాంపౌండ్ మొత్తం కష్టపడి తెరకెక్కించిన సినిమా నేనేరాజు నేనే మంత్రి రిలీజ్ కి రెడీ అయింది. అయితే ఫామ్ లోలేని డైరెక్టర్ తేజ చేతిలో ఈ సినిమాను పెట్టడంతో ఈ విషయంలో మొదటి నుంచి మార్కెట్ వర్గాల్లో ఓ తెలియని టెన్షన్ నెలకొంది. అయితే ఆ భయం ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరకొచ్చే కొద్దీ ఎక్కువైపోతుందట. దీనికి రెండు ముఖ్య కారాణాలు అని తెలిసింది. నేనే రాజు నేనే మంత్రి తో మరో రెండు క్రేజీ సినిమాలు అదే రోజున విడుదల అవుతున్నాయి. వాటిలో జయజానకి నాయకకి బోయపాటి సపోర్ట్ ఉంటే, లై కి నితిన్ క్రేజ్ అండగా ఉంది. అయితే ఈ రెండు సినిమాలతో పోలిస్తే ఎటు చూసిన నేనే రాజు నేనే మంత్రికే సపోర్ట్ తక్కువుగా అనిపిస్తుంది.

రానా - కాజల్ తప్పిస్తే ఈ సినిమాలో ఎలాంటి సేలబుల్ ఆప్షన్స్ కనిపించవు. వీరిద్దరిలో కాజల్ కే కాస్తో కూస్తో ఎక్కువ క్రేజ్ ఉంది. రానా పాపులారిటీ కేవలం కొందరి వరకే పరిమితం. ఈ నేపథ్యంలో కాజల్ పాత్ర సినిమా మధ్యలోనే ముగిసిపోతుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అలానే క్లైమాక్స్ లో రానా పాత్ర కూడా ట్రాజెడి ఎండింగ్ తో ముగిసిపోతుందని తెలిసింది. ముందు నెగిటివ్ షేడ్స్ తో ఆ తరువాత పాజిటివ్ షేడ్స్ తో ఉన్న రానా క్యారెక్టర్, సినిమా ఎండింగ్ లో చనిపోతాడని వార్తలు వస్తున్నాయి. దీంతో హీరో పాత్ర చనిపోయే ఎండింగ్ తో ఉన్న సినిమాలు తెలుగునాట గతంలో పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదని, ఈ సినిమాకి కూడా అదే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందనే ఆందోళన ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో తీవ్రంగా నెలకొంది. మరి ఈ టెన్షన్స్ కు రానా ఏ రీతిన ఆన్సర్ ఇస్తాడో చూడాలి.
Tags:    

Similar News