ఎంత మంచి సినిమా తీశామన్నది కాదు. దాన్ని.. ఎంత బాగా ప్రేక్షకులకు చేరవేశామా? అన్నది కూడా పాయింటే. ఈ విసయంలో తన సినిమాను శిల్పాన్ని చెక్కినట్లు చెక్కే రాజమౌళి.. సదరు సినిమా ప్రమోషన్ యాక్టివిటీని సైతం షెడ్యూల్ ప్రకారం పక్కా ప్లాన్ తో చేయటం తెలిసిందే. అన్ని అనుకున్నట్లు జరిగితే.. ఈ రోజు(జనవరి 7) ‘ఆర్ఆర్ఆర్’ రోజుగా నిలిచేది. కానీ.. కరోనా మహమ్మారి కారణంగా.. అందుకు భిన్నమైన పరిస్థితి.
ఈ సినిమా విడుదల కోసం.. ప్రత్యేకంగా చాపర్ బుక్ చేసుకొని.. దేశ వ్యాప్తంగా మూవీ ప్రచారం కోసం ఆర్ఆర్ఆర్ టీంలో కీలకమైన రాజమౌళి.. ఎన్టీఆర్..రాంచరణ్.. అలియాభట్ లు ఎంతలా జర్నీలు చేశారో తెలిసిందే. సినిమా ప్రచారానికి అవకాశం ఉన్న ఏ చిన్నది వదిలిపెట్టకుండా చుట్టేసిన దానికి అయిన ఖర్చు ఏకంగా రూ.20కోట్లుగా తేలటం.. ఇదో హాట్ న్యూస్ గా మారటం తెలిసిందే.
ఈ ప్రమోషన్ లో భాగంగా ప్రముఖ టీవీ షో.. కపిల్ శర్మ నిర్వహించే ప్రోగ్రాంకు ఆర్ఆర్ఆర్ టీం హాజరు కావటం తెలిసిందే. ఈ షోలో పాల్గొన్ సందర్భంగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. తారక్.. రాంచరణ్.. తాము ధరించిన కాస్ట్యూమ్ మీద.. మూవీ టైటిల్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే.. వీరితో పాటు ఈ షోలో పాల్గొన్న అలియా కాస్ట్యూమ్ కు మాత్రం చిత్ర టైటిల్ లేకపోవటం గమనార్హం.
తన సినిమాకు సంబంధించిన విషయం ఏదైనా సరే.. అన్ని అందరికి ఒకేలా ఉండేలా వ్యవహరించే రాజమౌళి.. అలియా విషయంలో మినహాయింపు ఎందుకు ఇచ్చారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన సినిమా షూటింగ్ లో.. లైట్ బాయ్ మొదలు.. హీరో వరకు అందరూ ఐడీ కార్డులు వేసుకొని పని చేయించే రాజమౌళి.. తాజా ప్రమోషన్ లో తన తీరుకు భిన్నంగా అలియాకు ఎవరికి ఇవ్వని మినహాయింపు ఇవ్వటం ఏల? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.