ఎన్టీఆర్ తో ఈ ముగ్గురు భామలేనా?

Update: 2016-12-14 03:41 GMT
జనతా గ్యారేజ్ సక్సెస్ మూడ్ లోంచి జూనియర్ ఎన్టీఆర్ బయటకు వచ్చేశాడు. 50 రోజులకే టీవీలో వేసేయడంతో 100 రోజులు జరుపుకునే అవకాశం రాలేదు కానీ.. లెక్క ప్రకారం అయితే.. ఇప్పటికి గ్యారేజ్ రిలీజ్ అయ్యి సెంచరీ దాటిపోయింది. ఇన్ని రోజుల తర్వాత దర్శకుడు బాబీతో కొత్త సినిమాకి యంగ్ టైగర్ ఓకే చెప్పేయగా.. డైరెక్టర్ స్క్రిప్ట్ పనుల్లో పడిపోయాడు.

మరోవైపు నిర్మాత కళ్యాణ్ రామ్ ప్రీ ప్రొడక్షన్ పనులు జెట్ స్పీడ్ లో ఫినిష్ చేసేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. రెండు డిపార్ట్ మెంట్స్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్న జూనియర్.. ఈ మూవీ హీరోయిన్స్ విషయంలో ఓ ఫైనల్ డెసిషన్ కి వచ్చేశాడనే టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. నాని జెంటిల్మెన్ లో మెరిసిన నివేదా థామస్.. మలయాళీ కుట్టి అనుపమా పరమేశ్వరన్ లను దాదాపు ఓకే చేసేసినట్లే అంటున్నారు.

బాబీ దర్శకత్వంలో రూపొందే ఈ మూవీలో ఎన్టీఆర్ మూడు పాత్రలు చేయనున్నాడనే సంగతి ఇప్పటికే లీక్ అయిపోగా.. ఈ మూడు పాత్రలకు ముగ్గురు హీరోయిన్స్ ఉంటారన్న మాట. ఇక సినిమా షూటింగ్ విషయానికి వస్తే జనవరిలో మొదలు పెట్టి జూన్ నాటికి ఫినిష్ చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News