ఆ డీల్స్ తూచ్ అంటున్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు!

Update: 2020-06-02 11:50 GMT
మన తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ చాలాకాలంగా ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. గత ఏడాది వరస ఫ్లాపులతో ఓవర్సీస్ మార్కెట్ దెబ్బ తిన్నమాట నిజమే కానీ ఈ ఏడాది ఆరంభంలో తెలుగు సినిమాలు మంచి కలెక్షన్లు తీసుకురావడంతో ఇక ఓవర్సీస్ మార్కెట్ సెట్ అయిందని సంతోషపడ్డారు. ఇంతలోపే మహమ్మారి దెబ్బకు సీన్ రివర్స్ అయింది.

లోకల్ గా పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కానీ ఓవర్సీస్ లో మునుపటి స్థితి రావాలంటే కనీసం ఏడాది పాటు వేచి చూడకతప్పదని అంటున్నారు. దీంతో ఇప్పటికే ఓవర్సీస్ డీల్స్ క్లోజ్ చేసుకున్న బయ్యర్లు.. డిస్ట్రిబ్యూటర్లు తలలు పట్టుకుంటున్నారట. కొందరేమో తమ డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని.. మరి కొందరేమో గతంలో చేసుకున్న అగ్రిమెంట్ అమౌంట్లు వర్క్ అవుట్ కావని... వాటిని తగ్గించాలని పట్టుబడుతున్నారట.

ప్రతి ఒక్క సినిమాపై ఈ ప్రభావం ఉందని.. 'RRR'.. 'వకీల్ సాబ్'.. 'V'.. 'రెడ్' లాంటి సినిమాల విషయంలో ఇప్పటికే చర్చలు సాగుతున్నాయని సమాచారం. తెలుగు సినిమాలే కాదు.. తమిళ సినిమాలపై కూడా ఈ ప్రభావం ఉందని.. 'మాస్టర్' లాంటి సినిమాల రైట్స్ సొంతం చేసుకున్న వారు డబ్బు వెనక్కు ఇవ్వాలని కోరుతున్నారట.
Tags:    

Similar News