మూడేళ్ల తర్వాత ఇండియాకి వచ్చిన స్టార్‌ హీరోయిన్‌

Update: 2022-11-01 17:30 GMT
బాలీవుడ్ ప్రేక్షకులను సుదీర్ఘ కాలంగా హీరోయిన్‌ గా అలరిస్తున్న ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా. ఈమె గత కొన్నాళ్లుగా హిందీ సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది. ఈమె ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలు మరియు సిరీస్‌ లపైనే ఎక్కువ దృష్టి పెడుతోంది. గ్లోబల్‌ స్టార్‌ ట్యాగ్‌ రావడంతో ఈ అమ్మడు మరింతగా అక్కడే సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది.

ప్రియాంక చోప్రా గత మూడు సంవత్సరాలుగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కు పరిమితం అయ్యి ఉన్నారు. అమెరికాలోని ఇతర ప్రాంతాలకు లేదా ఇతర దేశాలకు అప్పుడప్పుడు ఈమె వెళ్లిందేమో కానీ ఇండియా కు మాత్రం గత మూడు సంవత్సరాలుగా వచ్చిందే లేదు.

2018 సంవత్సరంలో నిక్‌ జోనస్ ను వివాహం చేసుకున్న ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా పూర్తిగా అమెరికాలోనే సెటిల్‌ అయ్యింది. కరోనా ఇతర కారణాల వల్ల మూడు సంవత్సరాలుగా ఇండియాకు రావడానికి సాధ్యం అవ్వలేదు అంటూ ప్రియాంక సన్నిహితులు చెబుతున్నారు.

ఎట్టకేలకు ఇండియాలో ప్రియాంక చోప్రా ల్యాండ్‌ అయ్యింది. మూడు సంవత్సరాల తర్వాత రావడం చాలా సంతోషంగా ఉంది అన్నట్లుగా ఆమె కుటుంబ సభ్యులతో అన్నట్లుగా సమాచారం అందుతోంది.

మూడేళ్ల తర్వాత ప్రియాంక చోప్రా ఇండియాకు రావడం పట్ల ఆమె అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు సాదర స్వాగతం పలికారు.

ఇటీవలే సరోగసి విధానం ద్వారా తల్లి అయిన ప్రియాంక చోప్రా ఆ బేబీని తన తో పాటు ఇక్కడికి తీసుకు వచ్చిందా లేద అనే విషయం లో క్లారిటీ లేదు. నిక్‌ జోనస్ ఇండియాకు వెళ్తున్నట్లుగా సోషల్‌ మీడియా ద్వారా పేర్కొన్నాడు. దాంతో ప్రియాంక చోప్రా ఇండియా లో అడుగు పెట్టబోతుందని అందరికి తెలిసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News