మెహబూబా సినిమాతో అయినా రికవర్ అవుతాడేమో అనుకుంటే చివరికి పూరి జగన్నాథ్ డిజాస్టర్ నే అందుకున్నాడు. వరుస అపజయాలు పూరి కెరీర్ కు అవకాశాలు లేకుండా చేస్తున్నాయి. ఇంతకుముందు చేస్తాము అని చెప్పిన హీరోలు కూడా ఇప్పుడు పూరి అంటే పారిపోతున్నారు. ఒకప్పుడు డైలాగులతో హీరోలకు స్టార్ డమ్ తెచ్చిన పూరి ప్రస్తుతం ఏ విధంగాను ఆకట్టుకోవడం లేదు. అయితే ఫైనల్ గా ఆయనకు ఒక మంచి అఫర్ అందినట్లు టాక్.
గతంలో నాగార్జున తో పూరి జగన్నాథ్ రెండు సార్లు పని చేసిన సంగతి తెలిసిందే. శివమణి - సూపర్ సినిమాలు దేనికవే డిఫెరెంట్ తెరకెక్కించి పూరి మంచి హిట్ కొట్టాడు. 2005 లో చివరిసారిగా కనిపించిన ఈ కాంబో మళ్లీ పదమూడేళ్ల తరువాత కనిపించనుంది. ప్రస్తుతం కథలు చాలానే ఉన్నా కూడా పూరి ఎవరి దగ్గరికి వెళ్లిన సెట్ కావడం లేదు. దీంతో నాగ్ ను కలవడంతో కథ వినగానే ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం నాగార్జున నాని తో మల్టి స్టారర్ చేస్తున్నాడు. ఆ తరువాత బంగార్రాజు కథను సెట్స్ పైకి తెచ్చే అవకాశం ఉంది. రెండు కథలతో బిజీ కాబట్టి పూరి కాన్సెప్ట్ పట్టాలెక్కడానికి కాస్త సమయం పట్టవచ్చు. ఇక వర్మతో చేసిన ఆఫీసర్ సినిమా ఈ జూన్ 1న రిలీజ్ కానుంది.