రాజమౌళి మంచి దర్శకుడని తెలుసు. కానీ తాను మంచి నటుణ్ని కూడా అంటున్నాడు జక్కన్న. షూటింగ్‌లో భాగంగా నటీనటులకు సన్నివేశాలు వివరించేటపుడు ఎలా ఇన్వాల్వ్ అయిపోతుంటాడో.. ఎలా నటించి చూపిస్తుంటాడో తన సినిమాల మేకింగ్ వీడియోలో చూశాం కాబట్టి.. ఆ అనుభవంతోనే తాను మంచి నటుణ్నని రాజమౌళి అంటున్నాడేమో అనుకోకండి. దీనికి రాజమౌళి చెబుతున్న కారణం వేరు.
''బాహుబలి విడుదల దగ్గర పడుతున్న కొద్దీ నేను దర్శకుడిగా కంటే మంచి నటుణ్నేమో అనిపిస్తోంది. ఎందుకంటే సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతోందనే ఆందోళన బయటకు కనిపించకుండా బాగానే నటిస్తున్నాను. ఒక విధంగా చెప్పాలంటే నేను ప్రస్తుతం ముఖానికి ప్రశాంతత అనే ముసుగు వేసుకున్నా'' అన్నాడు రాజమౌళి. అంత భారీ సినిమా తీస్తున్నపుడు లేని ఒత్తిడి.. విడుదల సమయంలో తమ బృందాన్నంతా ఊరికే ఉండనివ్వట్లేదని రాజమౌళి చెప్పాడు.
సినిమా బాగా వచ్చిందని.. ప్రేక్షకులకు నచ్చుతుందని కాన్ఫిడెన్స్ ఉన్నా.. ఒత్తిడి మాత్రం తప్పట్లేదన్నాడు రాజమౌళి. 'బాహుబలి' 80 శాతం పూర్తయ్యే వరకు చాలా ఉత్సాహంగానే ఉన్నామని.. చివరి 20 శాతం చిత్రీకరించాల్సి ఉన్నపుడు యూనిట్ సభ్యుల్లో కొంచెం ఉత్సాహం తగ్గడం గమనించానని.. ఇదే విషయాన్ని సెంథిల్‌తో చెబితే.. నన్ను చూసే వాళ్లంతా ఉత్సాహం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడని.. దాంతో తనలో ఉత్సాహం తగ్గడం కనిపించకుండా ముఖానికి మాస్క్ వేసుకుని పని చేశానని చెప్పాడు రాజమౌళి.