సినిమా రాజమౌళికి నచ్చలేదనమాట?

Update: 2016-01-19 09:30 GMT
మామూలుగా ఏ తెలుగు సినిమా చూసినా కూడా.. రొటీన్‌ గా రివ్యూర్లు ఇచ్చే రేటింగులు కంటే.. అసలు దర్శకదిగ్గజం రాజమౌళి తన ట్విట్టర్‌ టైమ్‌ లైన్‌ లో ఎటువంటి రివ్యూ ఇస్తాడా అని అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు రాజమౌళి మాత్రం ''నాన్నకు ప్రేమతో'' సినిమా గురించి ఏమీ చెప్పకపోవడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది.

అసలు జూ.ఎన్టీఆర్‌ అంటే రాజమౌళికి ప్రత్యేకమైన అభిమానం. పైగా యంగ్‌ హీరోల్లో తాను ఎన్టీఆర్‌ ఫ్యాన్ ను అంటూ ఓపెన్ గా చెప్పేశాడు ఈ మధ్యనే. ఇక అప్పట్లో ట్రైలర్‌ చూశాక కూడా రాజమౌళి నాన్నకు ప్రేమతో గురించి బాగానే పొగిడేశాడు. స్టయిలిష్‌ అంటూ తారక్‌ ను ఆకాశానికి ఎత్తేశాడు. అందుకే ఈ సినిమాను చూడ్డానికి తన బాహుబలి షూటింగ్‌ కు కూడా హాలీడే ఇచ్చాడని చెప్పుకున్నాం. కాని వెరైటీగా ఇంతవరకు గురువు గారు ఈ సినిమా గురించి ఒక్క ట్వీట్‌ కూడా వేయలేదు.

అసలు రాజమౌళి సినిమా చూడలేదా? లేకపోతే చూసినా మనోడికి సినిమా నచ్చలేదా? సంక్రాంతి సినిమాల్లో దేని గురించి రాజమౌళి మాట్లాడకపోవడం విడ్డూరమే మరి.
Tags:    

Similar News