రానా ల‌వ్ మ్యాట‌ర్ వెన‌క వెంకీ డాట‌ర్?

Update: 2020-06-09 04:18 GMT
టాలీవుడ్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ వికెట్స్ ఒక్కొక్క‌టిగా కూలుతున్నాయి. పెళ్లి బాజాతో ఓ ఇంటి వాళ్లు అయ్యేందుకు బ్యాచిల‌ర్స్ అంతా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తుండ‌డంతో ప‌రిశ్ర‌మ‌లో ఒక ర‌క‌మైన కొత్త శోభ క‌నిపిస్తోంది. ఇటీవ‌లే ద‌గ్గుబాటి రానా ఏమాత్రం బెరుకు లేకుండా తాను ప్రేమించిన మిహికా బ‌జాజ్ ని సోష‌ల్ మీడియాల్లో ప‌రిచ‌యం చేశాడు.

ఆ త‌ర్వాత ఇరు కుటుంబాలు రోఖా వేడుక‌ను నిర్వ‌హించి నిఖాని ఖాయం చేశారు. నిశ్చితార్థం తో ప‌ని లేకుండా నేరుగా పెళ్లి చేసుకునేందుకు రానా సిద్ధ‌మ‌వుతున్నార‌‌ని వార్త‌లొచ్చాయి. ఇక మిహిక బ్యాక్ గ్రౌండ్ అల్ల్రా రిచ్ బిజినెస్ ఫ్యామిలీ అన్న సంగ‌తి తెలిసిందే. త‌నే ఓ పెద్ద ఎంట‌ర్ ప్రెన్యూర్. వెడ్డింగ్ ప్లాన‌ర్ కం బిజినెస్ ఉమెన్. అందుకే రానా కుటుంబంతో వెంట‌నే సింక్ అయిపోయింది. రానా ల‌వ్ స్టోరీ గురించి అడిగేస్తే .. ఇలా ప‌రిచ‌యం చేశాడు.. అలా ఓకే అనుకున్నాం.. ఇలా పెళ్లాడేస్తున్నాడు!! అంటూ చ‌క‌చ‌కా చెప్పేశారు డి.సురేష్ బాబు.

అయితే రానాకు మిహీక ఎలా ప‌రిచ‌యం? అన్న‌ది ఆరా తీస్తే .. బాబాయ్ విక్ట‌రీ వెంక‌టేష్  పెద్ద కుమార్తె ఆశ్రిత‌కు మిహీక‌ క్లాస్ మేట్. చిన్న‌ప్ప‌టి నుంచి క్లోజ్. అలా సోద‌రి వ‌ల్ల‌నే మిహాక రానాకు పరిచయం అయ్యిందిట‌. ఇంత‌కుముందు ఆశ్రిత పెళ్లి వేడుక‌లోనూ మిహీక సంద‌డి చేసింది. ఆ క్ర‌మంలోనే రానా స్నేహం బాగా కుదిరింద‌ట‌. ఇప్ప‌టికి ప్రేమ ప‌రిమ‌ళించి పెళ్లి వ‌ర‌కూ వ‌చ్చింద‌న్న‌మాట‌.
Tags:    

Similar News