రంగస్థలం.. ఆ పేరు ఎందుకు పెట్టారంటే..

Update: 2017-06-28 09:24 GMT
సుకుమార్ డైరక్షన్లో వస్తున్న ‘రంగస్థలం 1985’ సినిమా పై రోజురోజుకూ సినీ ప్రేమికులు ఒక చక్కని సినిమా చూడబోతున్నాము అనే ఊహాలలో తేలుతున్నారు. దానికి తగ్గట్టుగానే సినిమా టీమ్ కూడా కొసరి కొసరి మరి వినిపిస్తుంది రంగస్థలం సినిమా విశేషాలును. రామ్ చరణ్ గెడ్డం పెంచి లుంగీ కట్టినప్పటి నుండి సినిమా పై అంచనాలు బాగానే పెరిగినాయి. గోదావరి అందాలు అక్కడ పల్లె సౌందర్యం ఈ సినిమా కథలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి అని చెబుతున్నారు.

ఈ సినిమా పేరు పెట్టినప్పటి నుండి రకరకాల కథలు వింటున్నాం. రామ్ చరణ్ ఈ సినిమాలో నాటకాలు వేసేవాడని, ఇంకా ఈ సినిమాలో ఒక నాటకాల కంపెనీ నడుపుతాడని ఇలా నాటకాల చుట్టూ రంగస్థలం పదానికి దగ్గరలో ఉన్న అన్నీ విషయాలును జోడించి ఒక్కొక్కరు ఒక్కో కథను చెప్పారు. కానీ ఇప్పుడు అవన్నీ ఒట్టి గాలి కబుర్లుగా మనం అనుకోవచ్చు. ఈ సినిమాలో కథ ఒక డబ్బున్న కుటంబంలో పుట్టిన అమ్మాయికి ఒక పేద కుర్రాడుకి మధ్యన జరిగిన ప్రేమ కథని తెలుస్తోంది. పైగా 'రంగస్థలం' అనే ఒక ఊరులో 1985 కాలంనాటి కథ కాబట్టి ఈ సినిమాకు రంగస్థలం 1985 అని పేరు పెట్టారట సుకుమార్ అండ్ కో. అది సంగతి.

పేద కుర్రాడుగా రామ్ చరణ్ ఇప్పటికే ఒదిగిపోయాడు. సమంత ఈ సినిమాలో గోదావరి పల్లెలో పెద్దింటి బిడ్డ అన్నమాట. ఆమె లుక్ కూడా అలాగే ఉందిలే. మైత్రి మూవీ మేకర్స్  ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. సుకుమార్ డైరక్షన్ చేస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం పెద్ద అసెట్ కానుందని యునిట్ వర్గాల టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News