పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ విడుదలైపోయింది. ఇంతలోనే టికెట్ ధరల్ని పెంచుతూ ఏపీలో కొత్త జీవో విడుదలైంది. ఏది ఏమైనా ఏపీలో టికెట్ ధరలు పెరిగాయి. ఈ పెంపును ఇకపై థియేటర్ యాజమాన్యాలు అమలు చేయనున్నాయి.
హీరో దర్శకుని పారితోషికాలు కలపకుండా 100 కోట్లకు మించిన బడ్జెట్ ఉన్న సినిమాలకు 20శాతం మించిన షూటింగ్ ఏపీలో చేస్తే వాటికి తొలి పది రోజులు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం కల్పించనుంది. రూ.250 గరిష్ఠ ధరను నిర్ణయించగా.. రూ.20 కనిష్ఠ ధరగా ఉంటుందని వెల్లడించింది ఈ జీవో. తాజా జీవోలో థియేటర్లను నాలుగు కేటగిరీలుగా విభజించి టికెట్ ధరల్ని నిర్ణయించడం విశేషం.
సరిగ్గా భీమ్లా నాయక్ విడుదలైపోయి.. రాధేశ్యామ్ విడుదలకు రెడీ అవుతున్న వేళ ఏపీ ప్రభుత్వ జీవో అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే పలు కమిటీలు వేసి ఎంతో రివ్యూలు చేసాక ఇప్పటికి ఏపీ ప్రభుత్వానికి ఈ టైమ్ వచ్చిందని అనుకోవాలి. అలాగే స్టార్ హీరోలంతా దిగొచ్చి నేరుగా ముఖ్యమంత్రి జగన్ ని కలవడం చాలావరకూ ప్లస్ అయ్యిందనే చెప్పాలి.
ఈ నెలలో విడుదల కాబోయే #RRR సహా #రాధేశ్యామ్ కి పెరిగిన టికెట్ ధరలు అందుబాటులోకి వస్తాయని మంత్రి పేర్ని నాని వరమిచ్చారు. ఆంధ్ర లో 20 శాతం షూటింగ్ జరుపుకోనప్పటికి ఈరోజు ఇచ్చిన GO తోనే ఆ రెండు సినిమాలు ప్రదర్శించబడతాయని అన్నారు మంత్రి వర్యులు.
ఈ రెండు సినిమాలకి కొత్త హైక్స్ వర్తిస్తాయి... 5 షో లకు పర్మిషన్ ఉందని వెల్లడించారు. అన్నట్టు ఐదో ఆటగా ఒక చిన్న సినిమాని థియేటర్లలో వేయాలని కూడా జీవోలో ప్రస్థావించారు. ఇకపై వచ్చే సినిమాలకి 20 శాతం అయినా ఆంధ్రాలో నిర్మాణం చేస్కుని ఉండాలి!! అన్నది ప్రభుత్వ కండీషన్. అయితే సినిమావాళ్లు దీనిని మ్యానేజ్ చేయగరు!!