సమంత.. ఎంత బిజీ అయిన అది మానదు

Update: 2016-04-14 05:30 GMT
సౌతిండియాలోనే సూపర్ బిజీ హీరోయిన్ ఎవరంటే.. సమంత అనాల్సిందే. ఎక్కువ సినిమాలతో బిజీగానే ఉండడమే కాదు.. ఒకేసారి అనేక సినిమాలను కవర్ చేస్తూ.. మరీ బిజీ అయిపోయింది శామ్స్. ప్రస్తుతం ఈ చెన్నై సుందరి షెడ్యూల్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.

రీసెంట్ గానే కోలీవుడ్ డబ్బింగ్ మూవీ పోలీసోడు ప్రమోషన్స్ లో పాల్గొంది సమంత. ఆ తర్వాత రోజే సూర్య మూవీ 24 ఆడియో ఫంక్షన్ కి అటెండ్ అయింది. ఈ రెండింటికీ.. మహేష్ తో కలిసి చేస్తున్న బ్రహ్మోత్సవం సెట్స్ నుంచి డైరెక్టుగా హాజరు కావడం విశేషం. వీటితో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న అ..ఆ.. చిత్రానికి గాను ఓ పాటను కంప్లీట్ చేస్తోంది. ఇది పూర్తవగానే.. నేరుగా జనతా గ్యారేజ్ సెట్స్ కి వెళ్లిపోనుందట సమంత.

ఇవే కాకుండా బ్రహ్మోత్సవం కోసం చివరి పాటను పిక్చరైజ్ చేయాల్సి ఉంది ఇంకా. ఇలా ఎన్ని కమిట్మెంట్స్ ఉన్నా.. ప్రమోషన్స్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాదు సమంత. ఎంత బిజీ అయినా పబ్లిసిటీని మాత్రం వదిలిపెట్టదు. అందుకే నిర్మాతలకు, దర్శకులకు ఫ్యావరేట్ హీరోయిన్ సమంత.
Tags:    

Similar News