సమంత క్లాసుల డోస్ పెరిగిందోచ్!!

Update: 2016-04-22 04:08 GMT
సౌత్ బ్యూటీ సమంత ఇప్పుడు క్లాసుల మీద క్లాసులు పీకుతోంది.  అది కూడా వేదాంతం టైపులో డైలాగులు వల్లించడం.. అందులో త్రివిక్రమ్ స్టైల్ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వరుసగా మాటల మాంత్రికుడి సినిమాల్లో నటిస్తున్న ఎఫెక్ట్.. అమ్మడి మీద గట్టిగానా కనిపిస్తోంది.

ఇప్పుడు టాలీవుడ్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న భామల్లో సమంత ఒకరు. అయితే దీనిపై ఎవరన్నా అడితే కూల్ గా క్వశ్చన్ చేస్తూనే.. క్లాస్ అందుకుంది సమంత. 'అసలు మీ అందరి దృష్టి ఎంతసేపూ స్టార్ల రెమ్యూనరేషన్ పైనే ఎందుకుం ఉంటుంది. ఓ సినిమా కోసం హీరోయిన్ ఎంత తీసుకుంది అని కకాకుండా.. ఎలా చేసింది అని ఆలోచించండి'అంటూ స్ట్రాంగ్ డోస్ ఇచ్చింది శామ్స్.

ఇక్కడితో అమ్మడి క్లాస్ పూర్తవలేదు. 'సినిమాలు చేస్తే డబ్బులొస్తాయి తప్ప.. డబ్బుల కోసం సినిమాలు చేయం. బతకడానికి కావాల్సినంతగా నా దగ్గరుంది. ఇంకా ఎక్కువ సంపాదించాలి, బీరువాల నిండా కట్టలు పేర్చుకోవాలి అనేంతగా పచ్చ కాగితాలపై ప్రేమ లేదు.' అంటూ సమంత చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News