మరో 100 కోట్ల సినిమాపై కన్నేసిన సమంత

Update: 2016-04-23 04:27 GMT
ఇప్పటికిప్పుడు సౌతిండియా మొత్తంలో ఫుల్లు హ్యాపీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే.. సమంత అనాల్సిందే. కోలీవుడ్ లో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈమెకు.. తెరి ఊరట నిచ్చింది. అప్పుడెప్పుడో కత్తి తప్ప.. తమిళ్ లో ఈ భామకి హిట్ లేదు. ఇప్పుడు స్టార్ హీరో విజయ్.. సమంత ఖాతాలో రెండో వంద కోట్ల వసూళ్లను రాబట్టిన చిత్రాన్ని వేశాడు. అందుకే శామ్స్ ఫుల్లు హ్యాపీ.

నిజానికి తెరికి మొదటి రోజునే డివైడ్ రివ్యూలు వచ్చాయి. వీటన్నిటినీ ఏ మాత్రం పట్టించుకోకుండా.. బాక్సాఫీస్ దగ్గర ఇరగదీసేస్తూ.. 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిపోయింది తెరి. ఈ చిత్రం ప్రచారం కోసం సమంత బోలెడంత కష్టపడింది. అయితే.. ఇప్పుడు సమంత మూడో వంద కోట్ల సినిమాపై కూడా కన్నేసింది.

ఇంకా విజయ్ సినిమాకి పబ్లిసిటీ కంటిన్యూ చేస్తున్నా.. మరో రెండు వారాల్లో విడుదల కానున్న సూర్య మూవీ 24 కు ప్రచారం స్టార్ట్ చేసేసింది శామ్స్. తాజాగా ఓ మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకుంది. సూర్య సినిమాలో కూడా సమంత గ్లామర్ బాగానే పంచింది. సూర్య కూడా తనకు మరో వంద కోట్ల వసూళ్లను రాబట్టే మూవీని అందించాలన్నది సమంత కోరిక.
Full View

Tags:    

Similar News