కొడుకుతో ఆడుకుంటున్న సమంత!!

Update: 2016-03-21 16:22 GMT
సమంత ఓ మూడు నెలల క్రితం 'నేను అమ్మనయ్యా' అంటూ పెట్టిన ట్వీట్ గుర్తుందా. ఈ సౌత్ సుందరిని ట్విట్టర్ లో రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్లకి లేటెస్ట్ ట్వీట్ షాక్ అనిపించదు కానీ.. సడెన్ గా చూస్తే మాత్రం ఏంటీ.. సమంతకు కొడుకా అనిపించక మానదు. అంతలా ఓ చిన్నారితో తన అనుబంధాన్ని పంచుకుంటోంది సమంత.

సినిమా పరిశ్రమలో అనుబంధాలు వ్యక్తిగతంగా పెనవేసుకోవడం చాలా తక్కువ. హీరోయిన్స్ ఈ విషయంలో కొంచెం ఎక్కువ రిజర్వడ్ గా ఉంటారు. కానీ చెన్నై బ్యూటీ సమంతకు.. టాలీవుడ్ లో నీరజ కోనతో చక్కటి రిలేషన్ ఉంది. ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ కాగా... సమంతకు బెస్ట్ ఫ్రెండ్ కూడా. టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ కజిన్ ఈ నీరజ కోన. గతేడాది డిసెంబర్ లో ఈమెకు కొడుకు పుట్టినపుడు.. 'నాకు కొత్త అనుబంధం - నేను అమ్మనయ్యా' అంటూ ట్వీట్ చేసిన సమంత.. ఇప్పుడా మూడు నెలల చిన్నారితో ఆడుకుంటున్న ఫోటోను ట్వీట్ చేసింది.

'నాకు దేవుడిచ్చిన కొడుకు అన్ష్. నాజీవితంలో అత్యంత అందమైన, ప్రియమైన అనుబంధం. నీరజ కోన ఎంతో అదృష్టవంతురాలు' అంటూ సమంత ట్వీట్ చేసింది. అదే ఫోటోను రీట్వీట్ చేస్తూ.. 'నా ఇద్దరు చిన్నారి పాపలు' అంటూ నీరజ కోన ట్వీట్ చేయడం మరింత ముచ్చట గొలిపింది.
Tags:    

Similar News