కమెడియన్ సప్తగిరి ఇప్పుడు హీరో అయిపోయాడు. లీడ్ హీరోగా వరుస సినిమాలతో ఆకట్టుకునేందుకు గట్టిగానే ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలను రిలీజ్ చేసిన సప్తగిరి.. మూడో సినిమాను సిద్ధు ఫ్రం శ్రీకాకుళం ఫేమ్ ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఈపాటికే స్టార్ట్ చేయాల్సి ఉంది. కానీ రెమ్యూనరేషన్ వివాదంతో నిర్మాత వెనక్కు తగ్గడంతో ఈ సినిమా ఆగిపోయిందనే టాక్ వచ్చింది.
సప్తగిరి ఏకంగా కోటి రూపాయలు పారితోషికం అడగడమే మూవీకి బ్రేక్ పడడానికి కారణంగా తెలుస్తోంది. కాని ఇప్పుడీ సినిమా షూటింగ్ మొదలు అవుతోంది. నిర్మాతకు తనకు మధ్య వచ్చిన విబేధాన్ని తనే స్వయంగా పరిష్కరించుకున్నాడట సప్తగిరి. తనకు రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు బదులుగా.. లాభాల్లో ఇవ్వాలంటూ ఓ ప్రపోజల్ పంపాడట హీరో సప్తగిరి. ఇందులో ప్రొడ్యూసర్ కు అంతగా అభ్యంతర పెట్టాల్సిన అంశం ఏదీ కనిపించలేదు.
నిజానికి ఓ సినిమా నిర్మాణంలో పారితోషికాలే మేజర్ పార్ట్ పోషిస్తాయి. లాభాలొస్తేనే డబ్బులు ఇవ్వమంటూ స్వయంగా హీరోనే ప్రపోజల్ పంపడంతో.. ఈచిత్రం త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసుకోనుంది. అయితే.. ఈ స్క్రిప్ట్ పై ఉన్న నమ్మకం.. దర్శకుడి కమిట్మెంట్ ను నిశితంగా పరిశీలించిన సప్తగిరి.. మూవీ రిలీజ్ తర్వాత తనకు కోటి కంటే ఎక్కువగానే ముడుతుందని సన్నిహితులతో అంటున్నాడట. అదీ కాన్ఫిడెంట్ అంటే.. అదీ హీరోయిజం అంటూ సప్తగిరిని సినీ జనాలు తెగ పొగిడేస్తున్నారు.