టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లాలని, అక్కడ తమ సత్తా చాటుకోవాలని చాలా మంది టాలీవుడ్ హీరోలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందు కోసం కొంత మంది పాన్ ఇండియా ప్రాజెక్ట్ లని ఎంచుకుంటూ తమ అదృస్టాన్ని పరీక్షించుకుంటుంటో కొంత మంది హీరోలు మాత్రం స్ట్రెయిట్ గా హిందీ సినిమాల్లో నటిస్తూ అక్కడ పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాస్ తరువాత ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, యంగ్ హీరో నిఖిల్ బాలీవుడ్ లోనూ సత్తా చాటుకున్నారు.
`పుష్ప` మూవీతో అల్లు అర్జున్, RRR తో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ హీరో నిఖిల్ `కార్తికేయ 2`తో బాలీవుడ్ లో తమ సత్తా చాటుకున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య దేశ వ్యాప్తంగా విడుదలైన ఇదే తరహాలో `పుష్ప` మూవీ అల్లు అర్జున్ ని, RRR తో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లని, `కార్తికేయ 2`తో నిఖిల్ ని పాన్ ఇండియా స్టార్లు గా మార్చేశాయి. వీరి తరహాలో బాలీవుడ్ లో పాగా వేయాలని ప్రయత్నించిన విజయ్ దేవరకొండ `లైగర్` మూవీతో భారీ డిజాస్టర్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
పూరి జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు మూడున్నరేళ్ల పాటు తెరకెక్కించిన `లైగర్`తో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో గ్రాండ్ గా పరిచయం కావాలనుకున్నాడు. తొలి ఎంట్రీతో బ్లాక్ బస్టర్ హిట్ ని దక్కించుకోవాలనుకున్నాడు. కానీ అతని ఆశలేవీ ఫలించలేదు. భారీ డిజాస్టర్‌ని సొంతం చేసుకుని షాకిచ్చాడు. `లైగర్`తో బాలీవుడ్ కు పరిచయం కావాలనుకున్న విజయ్ దేవరకొండ ఆశలన్నీ ఆవిరైపోయాయి.
విజయ్ దేవరకొండతో పాటు మరో ఇద్దరు హీరోలు కూడా బాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నాలు చేసి తొలి ప్రయత్నంలోనే చేతు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. అక్కినేని నాగచైతన్య `లాల్ సింగ్ చడ్డా`తో బాలీవుడ్ కు పరిచయమైన విషయం తెలిసిందే. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించి నిర్మించిన ఈ మూవీపై నాగచైతన్య భారీ ఆశలు పెట్టుకున్నాడు. కానీ సినిమా బాయ్ కాట్ వివాదంతో పాటు ఆశించిన విధంగా ఆకట్టుకోలేకపోవడంతో తొలి ప్రయత్నంలోనే భారీ ఫ్లాప్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇక బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ నటించిన యాక్షన్ అడ్వెంచర్ `రామ్ సేతు`. అభిషేక్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ద్వారా టాలీవుడ్ హీరో సత్యదేవ్ బాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. మంగళవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీపై సత్యదేవ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. కానీ మిక్స్డ్ రివ్యూస్ రావడంతో ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేక సత్యదేవ్ కు షాకిచ్చింది. ఇలా ఇప్పటి వరకు బాలీవుడ్ బాట పట్టాలనుకున్న ముగ్గురు టాలీవుడ్ హీరోలు ఆశలు ఆవిరయ్యాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.