శివానీ సింగ్... ఈ పేరు చెబితే పెద్దగా ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు. ఎందుకంటే... ‘అర్జున్ రెడ్డి’ సినిమా సంచలన విజయం సాధించిన తర్వాత విజయ్ దేవరకొండ నటించిన బ్యాక్ లాగ్ సినిమాల్లో వచ్చిన ‘ఏ మంత్రం వేశావె’ సినిమాలో హీరోయిన్ ఈ పిల్ల. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా విడుదల కాదనుకున్న చిత్రం... కాస్త విడుదలవ్వడం హ్యాపీగా ఉందీ పిల్ల.
ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారిన కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించింది శివానీ సింగ్. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని... అయితే తన వరకూ ఎప్పుడూ రాలేదంటూ... అందరి హీరోయిన్ల లాగే పాత పాటే పాడింది ఈ చిన్నది. ఎవరో ఒకరు ఈ కాస్టింగ్ కౌచ్ సమస్య గురించి తీవ్రంగా పోరాడాల్సిన అవసరముందని చెప్పిన శివానీ సింగ్... తనతో ఎవ్వరూ తోక జాడించేందుకు అవకాశం ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. నిక్కచ్చిగా మాట్లాడడంతో పాటు అందరితో అంటీ ముట్టనట్టు ప్రవర్తించడం వల్ల అలాంటి వాళ్లు తన దగ్గరికి రావడానికి భయపడేవాళ్లంటూ బడాయిలు పోయిందీ పాప. నిర్భయ ఉదంతం తర్వాత రక్షణ కోసం ఎప్పుడూ ఓ కత్తిని తన బ్యాగ్‌లోనే ఉంచుకునేదంట శివానీ సింగ్. అయితే ఆ కత్తిని వాడే అవసరం ఎప్పుడూ రాలేదంటోంది శివానీ సింగ్.
బాగానే ఉంది కాని.. అలా కత్తిని బ్యాగులో పెట్టుకుంటే ఎయిర్ పోర్టుల్లో గట్రా ఒప్పుకుంటారేటి? దానికంటే మా లగడపాటి రాజగోపాల్ సూచించిన పెప్పర్ స్ర్పే బెటర్ కదమ్మాయ్. ఒకసారి వాడి చూడు!!