వావ్.. అప్పుడే రాధ స్కూల్‌ కి వెళ్తుందా!

Update: 2023-06-15 18:45 GMT
రెండు దశాబ్దాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీలో 'ఇష్టం' అనే సినిమా తో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శ్రియ సరన్‌. తెలుగు లో పుష్కర కాలం పాటు స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలిగింది.

ఇప్పటికి కూడా ఇండస్ట్రీ లో ఏదో ఒక పాత్ర తో కనిపిస్తూనే ఉంది. నాలుగు పదుల వయసుకు చేరిన శ్రియ ఇప్పటికి బిజీగానే ఉంది.

ఒక వైపు నటిగా బిజీగా ఉన్న శ్రియ మరో వైపు తల్లిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూనే ఉంది. తన కూతురు రాధ యొక్క ఆలనా పాలన అన్ని విషయాలను కూడా శ్రియ చూసుకుంటూ ఉంది. రాధ యొక్క బాల్యం మొత్తం ను శ్రియ దంపతులు ఎంజాయ్‌ చేస్తున్నారు.

తాజాగా రాధ ను స్కూల్‌ కి పంపిన ఫోటోలు మరియు వీడియోలను షేర్‌ చేసింది. తల్లిగా బిడ్డ స్కూల్‌ కు వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ శ్రియ పోస్ట్‌ చేసింది. రాధ కరోనా సమయంలోనే జన్మించింది.. అప్పుడే స్కూల్‌ కి వెళ్తుందా అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు రాధ భవిష్యత్తు అధ్బుతంగా ఉండాలంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మొత్తానికి శ్రియను అభిమానించే వారు మరియు ఆమెను ఫాలో అయ్యే వారు పెద్ద ఎత్తున రాధ యొక్క స్కూలింగ్‌ ను ఎంజాయ్ చేయాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చాలా క్యూట్‌ గా ఉన్న రాధ అప్పుడే స్కూల్‌ కు వెళ్లి ఎంజాయ్‌ చేస్తోంది.

Similar News