మ‌హేష్ నిర్మాత‌లు అన్‌ హ్యాపీనా?!

Update: 2015-08-15 18:05 GMT
శ్రీమంతుడు సూప‌ర్‌ డూప‌ర్ హిట్ట‌య్యింది. అటు ఓవ‌ర్సీస్‌ లోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మ‌రోవైపు త‌మిళంలోనూ అద‌ర‌గొట్టేస్తోంది. పెట్టిన పెట్టుబ‌డులు ఎప్పుడో వ‌చ్చేశాయి. ఈ వీకెండంతా లాభాలు లెక్క‌పెట్టుకోవ‌డ‌మే. `బాహుబ‌లి` త‌ర్వాత హయ్య‌స్ట్ వ‌సూళ్లు సాధించిన‌చిత్రం, అత్య‌ధిక లాభాలు సొంతం చేసుకొన్న చిత్రంగా `శ్రీమంతుడు` రికార్డుల్లోకి ఎక్కుతుందంటున్నారు. ఇలాగైతే నిర్మాత‌లు హ్యాపీగా ఉండాలి క‌దా? అన్‌ హ్యాపీ ఎందుకు? అనేదేనా మీ సందేహం. లాభాల్లో నిర్మాత‌ల వాటా త‌గ్గింది. 20 రూపాయ‌లు వ‌చ్చే చోట 10రూపాయ‌లే లాభం వ‌స్తే అన్‌ హ్యాపీనే క‌దా మ‌రి!

మ‌హేష్ నిర్మాత‌లకి ఎక్క‌డ లాభాల్లో వాటా త‌గ్గిందంటే ఈ సినిమా విడుద‌ల‌కు ముందే ఈరోస్ సంస్థ‌కి టోకున 80కోట్ల‌కు అమ్మేశారు నిర్మాత‌లు. పెట్టిన పెట్టుబ‌డితో పాటు టేబుల్ మీద‌కే లాభాలు వ‌చ్చేశాయి. సేఫ్ ప్రాజెక్ట్ చేసేశాం అని నిర్మాత‌లు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే `శ్రీమంతుడు`  విడుద‌లై సూప‌ర్‌ హిట్ టాక్ తెచ్చుకొంది. సెకండ్ వీకెండ్‌ లోకి వ‌చ్చేస‌రికి సినిమా వంద‌కోట్లు వ‌సూలు చేసింది. కీల‌క‌మైన సెకండ్ వీక్ పూర్త‌య్యేస‌రికి ఇంకా బోలెడ‌న్ని డ‌బ్బులు వ‌చ్చేస్తాయి. అయితే అప్ప‌టికే అమ్మేశారు కాబ‌ట్టి 80కోట్ల‌కు త‌ర్వాత వ‌చ్చే లాభ‌మంతా ఈరోస్‌ కే వెళ్లిపోతుంది. దీంతో అన‌వ‌స‌రంగా సినిమాని అమ్ముకొన్నామే అని నిర్మాత‌లు భాద‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ధైర్యం చేసి సినిమాని సొంతంగా విడుద‌ల చేసుకొనుంటే మ‌రిన్ని లాభాలొచ్చేవే అని మ‌థ‌న‌ప‌డుతున్నార‌ట‌. `శ్రీమంతుడు`కి మ‌హేష్ కూడా ఓ నిర్మాతే. ఆయ‌నే ప్రోద్భ‌లంతోనే ఈరోస్‌ కి సినిమాని అమ్మేశార‌ట‌. గ‌త సినిమాల అనుభ‌వం దృష్ట్యానే మ‌హేష్ ఈ సేఫ్ గేమ్ ఆడార‌ట‌. దీంతో భారీ లాభాలు కోల్పోవ‌ల్సి వ‌చ్చింది. అయినా మ‌హేష్ మాత్రం వ‌చ్చినంత రానీ అని హ్యాపీగా ఉన్నాడ‌ట‌. నిర్మాత‌లు కూడా తొలి ప్ర‌య‌త్నంలోనే స‌క్సెస్‌ ఫుల్ సినిమా తీశాం క‌దా, ఇదొక  అనుభ‌వం అని స‌ర్దిచెప్పుకొంటున్న‌ట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News