'పుష్ప' సినిమా చూసిన వారికి ఒక పాత్రను సుకుమార్ ఎలా డిజైన్ చేస్తాడు? అందుకోసం ఆయన ఎంతలా కష్టపడతాడు? అనేది అర్థమైపోయి ఉంటుంది. ఈ సినిమాలో పుష్పకి విపరీతమైన యాటిట్యూడ్ ఉంటుంది. అది ఎక్కడా తగ్గకుండా ఆ పాత్రను నడిపించడంలో సుకుమార్ సక్సెస్ అయ్యాడు. పుష్ప లుక్ .. ఆ పాత్ర మాట్లాడే యాస .. ఆ పాత్ర యాటిట్యూడ్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆక్షర్షణగా మారాయి. ఇక ఈ సినిమాను తన పాటలతో దేవిశ్రీ ప్రసాద్ నిలబెట్టేశాడనే చెప్పాలి. ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడంలో పాటలు ప్రధానమైన పాత్రను పోషించాయి.
ఇక ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఎవరి అభిప్రాయాలను వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ కి ముందు ప్రతినాయకుడైన ఫహద్ ఫాజిల్ ఎంటరవుతాడు. నాయకుడికి .. ప్రతినాయకుడి మధ్య వార్ సెకండ్ పార్టులో ఒక రేంజ్ లో ఉంటుందనే విషయాన్ని ఆడియన్స్ కి రిజిస్టర్ చేయడానికి సుకుమార్ తనవంతు కృషి చేశాడు. ఎంతలా చేసినా ఒక సినిమాకి అసలు ముగింపు వేరే పార్టులో వేరేగా ఉన్నప్పుడు, ఆ స్థాయిలో ఫస్టు పార్టుకి ముగింపు ఇవ్వలేరు. అలాంటి ఒక క్లైమాక్స్ ద్వారా ప్రేక్షకులను ఒప్పించడం అంత తేలికైన విషయమేం కాదు. అందువల్లనే 'పుష్ప' ఫస్టు పార్టు క్లైమాక్స్ లో హీరో - విలన్ లాగుల మీద నిలబడిపోతారు.
అవతల హీరో పెళ్లికి సంబంధించిన సన్నాహాలు జరుగుతూ ఉంటాయి. చివరికి హీరో లాగు పైనే వెళ్లి పెళ్లి పీటలపై కూర్చుంటాడు. అయితే తాజా ఇంటర్వ్యూలో సుకుమార్ మాట్లాడుతూ .. " నిజానికి హీరో .. విలన్ ఇద్దరికీ కూడా లాగులు కూడా తీయించి నగ్నంగా నిలబడేలా చేయాలనుకున్నాను. 'ఇలాగే ఊళ్లోకి పోదాం పదా' అని హీరోతో సవాల్ చేయించి, అలా చూపించాలనుకున్నాడట. కానీ తెలుగు ప్రేక్షకులు ఈ తరహా క్లైమాక్స్ లను తట్టుకోలేరనే ఉద్దేశంతో ఆ ఆలోచనను విరమించుకున్నాను" అని చెప్పుకొచ్చాడు.
నిజంగా అలా చూపించి ఉంటే హీరో పెళ్లి పీటల మీదికి ఎలా వెళ్లి ఉండేవాడు? అలా వచ్చిన ఆ సామిని చూసి శ్రీవల్లి ఎలా స్పందించి ఉండేది? అనేదే ఇప్పుడు అందరూ ఊహించుకుంటున్నారు. ఈ విషయంపై ఫన్నీ మీమ్స్ వదులుతున్నారు. అసలే ఫస్టు పార్టు క్లైమాక్స్ విషయంలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇలా చేయాలనుకున్నాను అంటూ సుకుమార్ మరో ఆలోచన చెప్పడం వాళ్లని మరింత అసహనానికి గురిచేస్తోంది. సుకుమార్ లాగూలతో వదిలేయడం ఫస్టు పార్టు చేసుకున్న అదృష్టం .. అది చూసిన ప్రేక్షకుల అదృష్టం అనే చెప్పుకోవాలి. ఇక సెకండు పార్టుకి సంబంధించి కూడా ఆయనకి ఈ తరహా ఆలోచనలు రాకుండా ఉండాలని కోరుకుందాం.