బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ వారసుడు అర్జున్ కపూర్ హీరోగా గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నంలో ఉన్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ మరదలు మలైకాతో ఎఫైర్ నేపథ్యంలో అతడిని తొక్కేందుకు కుట్రలు ఎదురవుతాయని భావిస్తే బోనీకి ఉన్న ప్రాబల్యంతో అతడు నిలదొక్కుకోగలిగాడన్న విశ్లేషణ సాగుతోంది.
అదంతా అలా ఉంటే.. మరోవైపు అర్జున్ కపూర్‌ను రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి చిన్న బుచ్చడం ప్రముఖంగా చర్చకొచ్యచింది. ఇంతకీ మీడియా గురూ ఆర్నబ్ ఏమని అన్నాడు? అంటే.. `అర్జున్ స్మాల్ టైమ్ యాక్టర్` అంటూ తీసి పారేశాడు. దీంతో అర్జున్ చిన్నబుచ్చుకునే పరిస్థితి తలెత్తిందని బహిరంగ వ్యాఖ్యానాలు వేడెక్కించేస్తున్నాయి. నిజానికి ఆర్నాబ్ నెప్టోయిజాన్ని బాలీవుడ్ పెద్దల్ని ఓ రేంజులో ఆడుకుంటాడు. అందులో భాగమే ఇదంతా అని అంతా భావిస్తున్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కంగనా రనౌత్ కార్యాలయాన్ని బిఎంసి పడగొట్టడంపై ఛానెల్ చర్చలు జరుపుతున్న వేళ అర్జున్ ప్రస్థావన వచ్చింది. అర్నాబ్ జాతీయ టెలివిజన్ లో బోనీ కపూర్ కొడుకు గురించి అన్న మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ``అర్జున్ కపూర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. నాకు తెలియదు. అతను ఒక స్మాల్ టైమ్ నటుడు అని వారు అంటున్నారు. అతను ఎవరో నాకు తెలియదు`` అని అర్నాబ్ ప్రెస్ చేస్తూ చెప్పడం వీడియోలో హైలైట్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో సూటి పోటిగా ఆ ప్రెస్సింగ్ నే హైలైట్ చేయడంతో అటువైపు చిర్రెత్తిపోతోందట.
కంగనా రనౌత్ కాకుండా ఇతర ప్రముఖులకు బిఎంసి నోటీసుల పంపిందని.. అర్జున్ లాంటి స్మాల్ టైమ్ యాక్టర్ కి నోటీసులు పంపిందని ఆయన అన్నారు. నిజానికి సదరు న్యూస్ ఛానల్ నినాదాలు చేస్తూ.. నటులను కించపరచడానికి ఇలాంటి పదాలను ఉపయోగిస్తున్నారని పూజా భట్ ట్వీట్ చేయడం ఆసక్తికరం.
అవుట్ ఆఫ్ వర్క్ నటుడు.. బి లేదా సి గ్రేడ్ యాక్టర్ వంటి పదాలను దిగజార్చడానికి ఒక సాధనంగా మీడియాల్లో ఉపయోగిస్తారని.. ఒక నటుడు .. కళాకారిణిగా ఉన్న ఆనందం మిగల్చనివ్వరని పూజా భట్ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇటీవలే అర్జున్ కపూర్ కి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైద్యులు సలహా మేరకు గృహనిర్భంధంలో ఉన్నాడు. చికిత్స అందుతోంది. తదుపరి పలు సినిమాల చిత్రీకరణలకు వెళ్లాల్సి ఉంది.