ట్రైలర్ టాక్: స్పోర్ట్స్ అంటే బిజినెస్ కాదని గుర్తు చేస్తున్న 'ఏ1 ఎక్స్ ప్రెస్'
యువ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఏ1 ఎక్స్ ప్రెస్'. జాతీయ క్రీడ హాకీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడు. ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. గ్రాండ్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రానికి డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. ఈ క్రమంలో నేడు రిపబ్లిక్ డే సందర్భంగా 'ఏ1 ఎక్స్ ప్రెస్' ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఇండియా ఫస్ట్ హాకీ వరల్డ్ కప్ గెలవడం.. హాకీని జాతీయ క్రీడగా ప్రకటించడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఈ ట్రైలర్ ప్రారంభమైంది. 'మన దేశంలో స్పోర్ట్స్ మ్యాన్ కి ఇవ్వాల్సిన కనీస రెస్పెక్ట్ కూడా దొరకడం లేదు.. ఇక్కడ స్పోర్ట్స్ బిజినెస్ అయి చాలా కాలం అయింది.. ఏ స్పోర్ట్స్ చూడాలో ఏ స్పోర్ట్స్ చూడకూడదో బిజినెస్ మ్యానే డిసైడ్ చేస్తున్నాడు' అని సందీప్ కిషన్ చెప్పే డైలాగ్ తో సినిమా నేపథ్యం ఏంటో అర్థం అవుతోంది. 'ఇండియాలో సగం మంది హాకీ కోచ్ అంటే షారుఖ్ ఖాన్ అనే అనుకుంటున్నారు' అంటూ జాతీయ క్రీడని పట్టించుకోవడం లేదని గుర్తు చేస్తున్నారు. పర్ఫెక్ట్ హాకీ ప్లేయర్ గా కనిపించడం కోసం సందీప్ పడిన కష్టం కనిపిస్తోంది. దీనికి హిప్ హాప్ తమిజ అందించిన నేపథ్య సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది.
ఇది సందీప్ కిషన్ కెరీర్ లో 25వ సినిమా. ఇందులో మురళీ శర్మ - రావు రమేష్ - రాహుల్ రామకృష్ణ - మహేష్ విట్టా - ఖయ్యూమ్ - భూపాల్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. కెవిన్ రాజ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ - అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ - వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ - సందీప్ కిషన్ - దయా పన్నెం కలిసి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 'ఏ1 ఎక్స్ ప్రెస్' చిత్రాన్ని ఫిబ్రవరి నెలలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Full View