డబ్బు కోసం దేనికైనా రెడీ.. ఆర్‌ఆర్‌ఆర్‌ బ్యూటీని ఆడేస్తున్నారు

Update: 2022-05-09 13:12 GMT
ఇటీవల బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్ పాన్ మసాలా యాడ్‌ లో నటించడంతో ఏ స్థాయిలో ఆయనపై విమర్శలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతుకు ముందు అజయ్ దేవగన్‌ మరియు షారుఖ్‌ ఖాన్‌ లు పాన్‌ మసాలా యాడ్స్ లో నటించిన సమయంలో పెద్దగా విమర్శలు రాలేదు. కాని అక్షయ్‌ కుమార్‌ కూడా ఆ యాడ్స్ లో నటించడం వల్ల విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.

తాజాగా ఆలియా భట్‌ కూడా అదే తరహా విమర్శలు ఎదుర్కొంటోంది. డబ్బు కోసం ఇష్టం లేని పనులు చేయడం తో పాటు.. తనకు ఇష్టం లేని పదార్థాలను కూడా తింటుంది అంటూ సోషల్‌ మీడియాలో ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. ఆలియా భట్‌ సోషల్‌ ఇప్పుడు తాను అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న కారణంగా విమర్శలను ఎదుర్కొంటుంది.

అసలు విషయం ఏంటీ అంటే ఆలియా భట్‌ ఒకానొక సమయంలో కలంక్ సినిమా ప్రమోషన్ లో భాగంగా వరుణ్‌ దావన్ తో కలిసి ది కపిల్ శర్మ షో లో పాల్గొంది. ఆ సమయంలో అక్కడి ప్రొడక్షన్ టీమ్‌ ఆలియాకు టీ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆమె ఒక సిప్ తాగి బాబోయ్ ఇందులో చక్కెర ఉంది. తాను చక్కెర తినను తాగను అంటూ కాస్త హడావుడి చేసింది. చెక్కర ఆరోగ్యానికి హానికరం అన్నట్లుగా ఆ సమయంలో మాట్లాడింది.

ఆమె చక్కెర తినదు.. కాని ఇతరులు మాత్రం చెక్కర తినాలంటూ ప్రమోషన్స్ చేస్తుంది. సోషల్‌ మీడియాలో ఇప్పుడు ఆమె చెక్కెరతో తయారు చేసిన పదార్థాలు తింటున్న వీడియో లు మరియు ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. వాటి ప్రమోషన్‌ సమయంలో తాగుతూ ఉన్న మీరు ఎందుకు చెక్కర ఉన్న టీ తాగడం లేదు అంటూ కొందరు ఆమెను నేరుగా ప్రశ్నిస్తున్నారు.

డబ్బు ఇవ్వడం వల్లే ఇష్టం లేని చక్కెర తినడం లేదా తాగడం చేస్తున్నారు అంటూ ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆమెను ఓ రేంజ్ లో జనాలు మీమ్స్ తో ఆట ఆడేసుకుంటున్నారు. ఇలాంటి వారు బాలీవుడ్‌ లో ఎంతో మంది ఉన్నారని.. తాము తిన్నకున్నా జనాలు తినేలా చేస్తూ ప్రమోషన్‌ చేస్తున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి. జనాల గురించి పట్టించుకోకుండా డబ్బు కోసం దేనికైనా సిద్ధం అన్నట్లుగా వీరు వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి.

https://twitter.com/FilmyPulao/status/1523327988112052225
Tags:    

Similar News