చంద్రముఖి చిత్రంతో నటిగా దేశ వ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకున్న హీరోయిన్ జ్యోతిక. హీరో సూర్య ను వివాహం చేసుకున్న తర్వాత దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న జ్యోతిక మళ్లీ నటనతో బిజీగా మారింది. అనూహ్యంగా జ్యోతిక నటించిన సినిమాలు సక్సెస్ అవుతూ ఉన్న కారణంగా వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.
తెలుగు లో సీనియర్ హీరోయిన్స్ అక్కగా.. వదినగా మాత్రమే పాత్రలు దక్కించుకుంటూ ఉంటారు. కానీ తమిళంలో జ్యోతిక కి మంచి పాత్రలు లభించాయి. కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలను కూడా జ్యోతిక చేసింది అంటే ఏ స్థాయిలో ఆమె తమిళనాట జోరును కొనసాగిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న ఈ సమయంలో ఇతర భాషల నుండి కూడా ఆఫర్లు వస్తున్నాయి. ఇతర భాషల సినిమాల ఆఫర్లను పట్టించుకోని జ్యోతిక ఎట్టకేలకు హిందీ సినిమాకు కమిట్ అయ్యిందని సమాచారం అందుతోంది. హిందీలో జ్యోతిక 2001 సంవత్సరంలో లిటిల్ జాన్ అనే సినిమాను చేసిన విషయం తెల్సిందే.
ఆ సినిమా తర్వాత మళ్లీ ఇప్పటి వరకు హిందీ వైపు చూడలేదు. హిందీలో దాదాపు 22 ఏళ్ల తర్వాత జ్యోతిక సినిమా చేసేందుకు ఓకే చెప్పింది. అయ్ దేవగన్ మరియు మాధవన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఒక చిత్రంలో జ్యోతిక కీలక పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.
మాధవన్ తో గతంలో సినిమాలు చేసిన జ్యోతిక మరోసారి జత కట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. వికాస్ బహ్ల్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా లో జ్యోతిక పాత్ర గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందబోతున్న ఈ పాన్ ఇండియా సినిమా తో జ్యోతిక మరో బిగ్ బ్రేక్ దక్కించుకుంటుందేమో చూడాలి.