కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర దర్శకుడిగా, హీరోగా తెలుగు, కన్నడ భాషల్లో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఆయన నుంచి సినిమా వస్తోందంటే అందులో ఎంతో కొంత ప్రత్యేకత వుంటుందని ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక భావన వుంది. ఆ భావనకు తగ్గట్టుగానే ఆయన దర్శకుడిగా, హీరోగా సినిమాలు చేస్తున్నారు.
తెలుగులో అప్పుడప్పుడు క్యారెక్టర్ డిమాండ్ ని బట్టి ప్రత్యేక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. `సన్నాఫ్ సత్యమూర్తి`.. తాజాగా వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా `గని` చిత్రంలోనూ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ త్వరలో విడుదలకు సిద్ధంగా వుంది.
ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ `కబ్జ`లో నటిస్తున్న ఉపేంద్ర తాజాగా మరో పాన్ ఇండియా మూవీని ప్రకటించారు. సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ మ్యూజిక్ కంపనీ లహరి మ్యూజిక్ ఈ మూవీతో ప్రొడక్షన్ రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది.
లహరి ఫిలింస్ ఎల్ ఎల్ పీ, వీనస్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ భారీ పాన్ ఇండియా మూవీని నిర్మించబోతున్నాయి. `యు` పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో ఉపేంద్ర హీరోగా నటిస్తూనే ఈ పాన్ ఇండియా మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.
శుక్రవారం ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు. అంతే కాకుండా ఈ మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. హీరో ఉపేంద్ర ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా విడుదల చేస్తూ ఆసక్తికరమైన పోస్ట్ ని అభిమానులతో పంచుకున్నారు.
గుర్రం నాడాని మూవీ టైటిల్ `యు`గా డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా స్మశానంలా తలపిస్తున్న ప్రాంతంలో కొమ్ములు తిరిగిన గుర్రంపై స్కేర్ లుక్ లో ఉపేంద్ర కనిపిస్తున్న తీరు కూడా సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.
టైటిల్ లో మరో విశేషం ఏంటంటే పోస్టర్ లో యు ఆకారంలో వున్న గుర్రపు నాడా ని టైటిల్ గా చూపించారు.. ఇక మధ్యలో మండుతున్న ఎర్రని మంటని ఎర్రని బొట్టుగా చూపించిన తీరు ఆకట్టుకుంటోంది. ఈ భారీ పాన్ ఇండియా యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీని .జి. మనోహరన్, శ్రీకాంత్ కెపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. అందుకే పోస్టర్ పై భాగంలో ఐదు భాషల్లో ఓ స్లోగన్ ని రాశారు.
ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఈ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా ప్రకటించిన హీరో ఉపేంద్ర.. ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఆసక్తికరమైన పోస్ట్ ని అభిమానుల కోసం షేర్ చేశారు.
`సినీ పరిశ్రమలో ఉపేంద్ర కథను సృష్టించింది నువ్వే.. 33 ఏళ్ల పాటు స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ రాసింది నువ్వే.. ఈలలు, క్లాప్ లతో దర్శకత్వం వహించింది మీరే... ప్రజా ప్రభు అభిమానులైన మీకు ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నాను` అంటూ ఉపేంద్ర పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభం అయ్యేది.. ఎప్పుడు రిలీజ్ అయ్యేది మాత్రం ప్రకటించలేదు.