విక్టరీ వెంకటేష్ ఒక ఫిలాసఫర్ అనే సంగతి తెలిసిందే. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెంకీ తరచుగా ఇన్స్పిరేషనల్ సందేశాలను పోస్ట్ చేస్తూ ఉంటారు. గత కొన్ని రోజులుగా రిలేషన్ షిప్ - ప్రేమ - నమ్మకం - జీవితం వంటి అంశాలపై ఆయన కొటేషన్స్ పెడుతున్నారు. 'మనం ఏదైనా విషయంపై నోరు తెరిచి మాట్లాడే ముందు దాని గురించి కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలి' అంటూ వెంకటేష్ ఆ మధ్య షేర్ చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఇప్పుడు తాజాగా సీనియర్ హీరో షేర్ చేసిన ఇన్‌స్టా పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
''నిన్ను ఇష్టపడిన వాళ్లను ఎప్పుడూ మిస్ యూస్ చేయకు. నిన్ను కావాలనుకుంటున్న వాళ్లకు బిజీగా ఉన్నానని చెప్పకు. ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్ముతారో వాళ్లను ఎప్పుడూ మోసం చేయకు. నిన్ను ఎప్పుడూ గుర్తుపెట్టుకునే వాళ్లని అస్సలు మర్చిపోవద్దు'' అని ఇన్‌స్టా స్టోరీలో వెంకీ పోస్ట్ పెట్టారు. అయితే ఇది పరోక్షంగా తన మేనల్లుడు అక్కినేని నాగచైతన్య - సమంతల విడాకులను ఉద్దేశిస్తూ షేర్ చేసి ఉంటారని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే కరోనా సెకండ్ వేవ్ టైంలో 'నారప్ప' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన వెంకటేష్.. 'దృశ్యం 2' చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేశారు. అలానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 3' మూవీలో వరుణ్ తేజ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇక రానా - వెంకీ కలసి నెట్ ఫ్లిక్స్ కోసం 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఇది బాబాయ్ అబ్బాయ్ లకు డిజిటల్ డెబ్యూ.