టాలీవుడ్ టాప్ స్టార్స్ సినిమాలకే పరిమితం కాకుండా తమకు నచ్చిన రంగాల్లోనూ ప్రవేశిస్తూ పెట్టుబడులు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున గతంలో ఓ టీవీ ఛానల్ లో పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. .ఆ తరువాత ఐపీఎస్ ఫ్రాంచైజీలకు సంబంధించిన కేరళ టీమ్ ని సచిన్ తో కలిసి నాగార్జు, చిరంజీవి సహ భాగస్వాములుగా వ్యవహరించారు కూడా. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్స్రంగంలోకి ప్రవేశించి ఏసియన్ గ్రూప్ తో కలిసి ఏఎంబీ మాల్ ని ప్రారంభించడం తెలిసిందే.
మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా హోమ్ టౌన్ మహబూబ్ నగర్ లో మల్టీప్లలెక్స్ థియేటర్ ని ప్రారంభించడం, అంతకు ముందే రౌడీ బ్రాండ్ పేరుతో వస్త్ర ప్రపంచంలోకి ప్రవేశించడం తెలిసిందే. తాజాగా ఈ హీరోల తరహాలోనే విక్టరీ వెంకటేష్ కొత్త అడుగులు వేస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా వాహన దారులు ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాముఖ్యతనిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ రంగానికి భారీ డిమాండ్ మొదలైంది. ఈ విషయాన్ని గ్రమించిన విక్టరీ వెంకటేష్ ఈ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఛార్జింగ్ సదుపాయం అందించే బైక్ వో కంపెనీలోఎ పెట్టుబడులతో హీరో విక్టరీ వెంకటేష్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఈ కంపనీలో వెంకీ ప్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడంతో పాటు ఈ కంపనీకి వెంకటేష్ ప్రచార కర్తగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని సదరు కంపనీ ఓ ప్రకటనలో తెలియజేసింది. 2025 నాటికి దేశ వ్యాప్తంగా 20 వేల ఈవీ ఛార్జింగ్ పాయింట్ లని నెరకొల్పాలన్న లక్ష్యానికి చేరుకోవడానికి వెంకటేష్ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని కంపనీ ప్రతినిధులు స్పష్టం చేశారు.
అయితే ఈ కంపనీలో విక్టరీ వెంకటేష్ ఏ మేరకు పెట్టుబడులు పెట్టారన్నది మాత్రం సంస్థ వెల్లడించలేదు. బైక్ వో తో విక్టరీ వెంకటేష్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవడంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు సంస్థ సహ వ్యవస్థాపకుడు , ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ విద్యాసాగర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బైక్ వో లో భాగస్వామిని కావడం ఆనందంగా వుందని, ఇందులో భాగస్వాములుగా చేరడం ద్వారా మహిళలు పారిశ్రామిక వేత్తలుగా మారొచ్చని వెంకటేష్ స్పష్టం చేశారు.
గత ఏడాది వరుసగా రెండు చిత్రాలతో విజయాల్ని సొంతం చేసుకున్న విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది `ఎఫ్ 3`తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంపై వెంకీ ఫుల్ కాన్ఫిడెంట్ తో వుండటం గమనార్హం. ఇందులో వరుస్ తేజ్ మరో హీరోగా నటిస్తుండగా తమన్నా, మెహ్రీన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.