విశాల్ తెలుగు డ‌బ్బింగ్ వెన‌క టాప్ సీక్రెట్ ఇదే

Update: 2021-09-21 05:31 GMT
యాక్ష‌న్ హీరో విశాల్ న‌టించిన ప్ర‌తి త‌మిళ చిత్రం తెలుగులోకి అనువాద‌మై విడుద‌ల‌వుతున్నాయి. పందెం కోడి మొద‌లు అత‌డికి ఇక్క‌డా బోలెడంత క్రేజు ఉంది. విశాల్ న‌టించిన పందెంకోడి.. అభిమ‌న్యుడు స‌హా ఎన్నో యాక్ష‌న్ చిత్రాలు తెలుగులోనూ బ్లాక్ బ‌స్ట‌ర్లు అయ్యాయి.

ఇక తెలుగు వాడిగా విశాల్ కి తెలుగు అనువాదం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. కానీ డ‌బ్బింగ్ రూమ్ లో అత‌డు ప‌డే శ్ర‌మ ఎలాంటిది? అంటే ఇదిగో ఈ వీడియోనే సాక్ష్యం. ఎంతో ఎమోష‌న‌ల్ గా అలా ట్రాఫిక్ కానిస్టేబుల్ లా చేతులూపితేనే తెలుగు డ‌బ్బింగ్ చెప్ప‌గ‌ల‌డ‌ట‌! విశాల్ తెలుగులో డబ్బింగ్ చెప్ప‌డం వెనుక ఉన్న రహస్యం బయటపడిందిలా.. అంటూ తాజాగా ఓ వీడియోని రిలీజ్ చేయ‌గా అందులో ఫ‌న్ క‌డుపుబ్బా న‌వ్విస్తోంది.

#శత్రు డబ్బింగ్ కోసం ఈ శ్ర‌మ అంటూ టీమ్ వెల్ల‌డించింది. డ‌బ్బింగ్ థియేట‌ర్లో మైక్ ముందు నిల‌బ‌డి విశాల్ ఎంతగా త‌పిస్తున్నాడో ఈ వీడియో చెబుతోంది. అయితే నోట్లో మాట‌కు చేతులు ఊప‌డానికి సంబంధ‌మేమిటి? అంటే.. ఆ సీన్లో ఎమోష‌న్ అలాంటిది. ఎమోష‌న్ ని తేవాలంటే అంత ఇదిగా వ‌ర్క‌వుట్ చేయాల‌న్న‌మాట‌. శత్రు .. ప్ర‌స్తుతం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. త్వ‌ర‌లోనే విడుదల చేస్తారు.






Full View


Tags:    

Similar News