ప్రస్తుతం టాలీవుడ్ ని బయోపిక్ ల ఫీవర్ ఊపేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికిప్పుడు అరడజను బయోపిక్ ల పేర్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ - వైయస్సార్ - కత్తి కాంతారావు - సైనా నెహ్వాల్ - టైగర్ నాగేశ్వరరావు .. ఇలా బయపిక్ ల వేట సాగుతోంది. వీటితో పాటే అప్పట్లో దర్శకరత్న డా.దాసరి నారాయణరావు బయోపిక్ గురించి ప్రకటన వెలువడింది. డా.దాసరి కాలం చేశాక .. అనంతర కాలంలో ఆయన శిష్యులే దర్శకరత్న బయోపిక్ తీస్తున్నామని ప్రకటించారు. దాసరి ప్రియశిష్యుడు సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తానని అన్నారు.
అయితే దాసరి జయంతులు వస్తున్నాయి... వెళుతున్నాయి! కానీ మళ్లీ బయోపిక్ ప్రస్థావనే వినిపించడం లేదు. ఇప్పటివరకూ అందుకు సంబంధించిన ప్రయత్నాలు సాగుతున్న ఆనవాళ్లు కూడా కనిపించలేదు. కనీసం అధికారిక ప్రకటన ఏదైనా చేస్తారా? అన్న ఆశలు కూడా కనిపించలేదు. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ అద్భుతమైన హిస్టరీని క్రియేట్ చేసుకున్న గ్రేట్ పర్సనాలిటీ ఆయన. మద్రాసు నుంచి హైదరాబాద్ కి పరిశ్రమను తరలించడంలో - అలానే హైదరాబాద్ లో పరిశ్రమ పాదుకొనేలా చేయడంలో ఆయన పాత్ర ఎనలేనిది. స్టారాధిస్టార్లతో సినిమాలు తీశారు. ఏ ఇతర బయోపిక్ స్టార్లకు తీసిపోని అసాధారణ చరిత్ర ఉన్న గొప్ప మనిషి ఆయన. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా కొనసాగి - ఎంతో ప్రజా ప్రయోజనకర పనులు చేశారు. కానీ ఆయన మరణానంతరం ఆయన శిష్యులే మరిచారా? అన్న విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు.
సి.కళ్యాణ్ - వినాయక్ బాలయ్య మూవీ కోసం వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. రానా హీరోగా ఆయన తీస్తున్న సినిమా మధ్యలోనే ఉంది. ఆ క్రమంలోనే తదుపరి ప్రకటన వెలువడలేదని భావిస్తున్నారు. దాసరి వల్లనే సి.కల్యాణ్ అనే పేరు ఉందని ఆయనే చెబుతారు. ఇక సి.కళ్యాణ్ తో పాటు ఇతర శిష్యుల్లో సౌండ్ లేకపోవడం విరివిగా చర్చకొస్తోంది. దాసరి ఉన్నన్నాళ్లు జూబ్లీ హిల్స్ లోని ఆయన ఇంటి వద్దనే శిష్య బృందం సంచరించేది. అక్కడ నిరంతరం కోలాహాలంగా ఉండేది. ఇప్పుడు దాసరి ఇంటి వద్ద అసలు ఎలాంటి సందడి లేదు. తాజా సమాచారం ప్రకారం.. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న `ఎన్టీఆర్` బయోపిక్ లో గురువుగారి పాత్రలో వి.వి.వినాయక్ నటిస్తున్నారని తెలుస్తోంది. ఇదొక్కటే కాస్తంత ఊరట అన్నమాట!