బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ''కట్ పుట్లి''. తమిళ్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన 'రాచ్చసన్' చిత్రానికి ఇది హిందీ రీమేక్. తెలుగులో 'రాక్షసుడు' పేరుతో రీమేక్ చేయబడి సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
‘కట్ పుట్లి’ సినిమా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి డైరెక్ట్ ఓటీటీలో విడుదలైంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేశారు.
'రాక్షసన్' లాంటి సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేసి చెడగొట్టారని విమర్శించారు. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్స్ పెట్టి ఇంటెన్సిటీని మిస్ అయ్యేలా చేశారని.. అసలు ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్ లో రొమాన్స్ ఏంటని ట్రోలింగ్ చేశారు.
అయితే ఈ విమర్శలపై తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. ‘కట్ పుట్లి’ మూవీలో రొమాంటిక్ సన్నివేశాలు పెట్టడం తప్పేమీ కాదని ఆమె అభిప్రాయపడింది. క్రైమ్ థ్రిల్లర్ అయినా సరే మధ్యలో రొమాన్స్ - ఎంటర్టైన్మెంట్ ఉంటేనే రిలీఫ్ లాగా ఫీల్ అవుతారని.. అందుకే ఈ చిత్రంలో అలాంటి సీన్లు పెట్టామని వివరించింది. తమ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపింది.
''ప్రేక్షకులు రొమాన్స్ - సాంగ్స్ - డ్యాన్సులు చూడటానికి ఇష్టపడతారు. భారతీయ చిత్రాల్లో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. తెలుగు సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయంటే కారణం వాటిల్లో అన్ని రకాల భావోద్వేగాలు ఉండటం వల్లనే. గత మూడేళ్లుగా అందరూ కఠినమైన పరిస్థితులను చూసారు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు''
''కాబట్టి సినిమా మొత్తం కేవలం డ్రిల్లింగ్ అంశాలతో రూపొందించకుండా.. మధ్య మధ్యలో ఇలాంటి సన్నివేశాలు ఉంటే ఆడియన్స్ కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. అందుకే మేము కుటుంబం మొత్తం కలిసి చూసే చిత్రంగా దీన్ని రూపొందించాం" అని రకుల్ ప్రీత్ చెప్పుకొచ్చింది.
కాగా, ‘కట్ పుట్లి’ చిత్రానికి రంజిత్ తివారి దర్శకత్వం వహించారు. పూజా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వాసు భగ్నాని - జాకీ భగ్నాని - దీప్షికా దేశ్ ముఖ్ సంయుక్తంగా నిర్మించారు. రాజీవ్ రవి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించగా.. జూలియస్ ప్యాకియం బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూర్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.