నయనతారపై రాధారవి చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా తగ్గడం లేదు. తన వ్యాఖ్యలపై ఎంత మంది విమర్శలు చేసినా, తనను ఎంత మంది తప్పుబట్టినా కూడా రాధారవి మాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాను చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉందని, ఆ విషయాన్ని చాలా మంది ఒప్పుకుంటున్నారు. కొద్ది మంది మాత్రమే నన్ను విమర్శిస్తున్నారు అంటున్నాడు. నేను మాట్లాడిన మాటల్లో తప్పేం ఉంది అంటూ తన వ్యాఖ్యలను సమర్ధించుకునేందుకు మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మీరు క్షమాపణ చెప్పాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు కదా, నయన తార గారికి మీరు క్షమాపణ చెప్పారా అంటూ ప్రశ్నించిన సమయంలో.. నేను చేసిన వ్యాఖ్యల్లో తప్పేంటో వారు వీరు కాకుండా నయనతార చెప్పాలి. నేను చేసిన వ్యాఖ్యలు తప్పు అని, ఆ వ్యాఖ్యల వల్ల ఆమె బాధపడ్డట్లుగా నాతో చెప్తే అప్పుడు నా వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్తాను. అంత వరకు నేను క్షమాపణ చెప్పే ప్రశక్తే లేదు. ఆమె పారితోషికంను చూసి కుళ్లుకుని, ఆమె స్టార్ డంను చూసి తట్టుకోలేక రాధా రవి ఆ వ్యాఖ్యలు చేసినట్లుగా కొందరు భావిస్తున్నారు. అయితే ఆ విమర్శలను రాధా రవి కొట్టి పారేశాడు.
సినిమా పరిశ్రమలో పోటీ అనేది చాలా కామన్ గా ఉంటుంది. దానికి నేను ఎప్పుడు భయపడను, పట్టించుకోను. నా తర్వాత వచ్చిన వారు ఎంతో మంది స్టార్స్ అయ్యారు, మరి నేను వారిపై ఎందుకు కామెంట్స్ చేయలేదు. పారితోషికం విషయం కూడా నేను ఎప్పుడు పట్టించుకోను. పారితోషికం అనేది తక్కువ తీసుకున్నంత మాత్రాన నేనేం తగ్గిపోను అన్నాడు. మొత్తానికి తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటూ వివాదాన్ని మరింతగా పెంచుతున్నాడు. దెయ్యం పాత్రలు పోషించి, ఎంతో మందితో తిరిగిన నయనతార దేవత పాత్రకు ఎలా సూట్ అవుతుంది అనేది గతంలో రాధా రవి చేసిన విమర్శ. ఆ వ్యాఖ్యలే పెద్ద దుమారంను రేపుతున్నాయి.