మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''గాడ్ ఫాదర్''. మోహన్ రాజా దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవలే మూవీలో చిరు పాత్ర ఫస్ట్ లుక్ ని లాంచ్ చేశారు.
'గాడ్ ఫాదర్' పోస్టర్ లో మెగాస్టార్ బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని స్టైల్ గా కుర్చీలో కూర్చొని రాజసం చూపించారు. దీంతో పాటుగా ఒక చిన్న వీడియోని కూడా మేకర్స్ వదిలారు. ఇందులో సునీల్ కారు డోర్ తీయగా.. చిరు తనదైన శైలిలో నడుచుకుంటూ వస్తున్నాడు. చిరంజీవి తన వయసుకి తగ్గ పాత్రలో కనిపించబోతున్నారని ఫస్ట్ లుక్ తోనే క్లారిటీ ఇచ్చారు.
''గాడ్ ఫాదర్'' అనేది 'లూసిఫర్' అనే మలయాళ చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్ అనే సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించారు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే చిరంజీవి ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచే మాతృకతో పోలికలు మొదలయ్యాయి.
'లూసిఫర్' సినిమా అంతటా మోహన్ లాల్ వైట్ అండ్ వైట్ లో పంచ్ - షర్ట్ తో ఉంటారు. కొన్ని సీన్స్ లో మాత్రం సూటు బూటూ వేసి కనిపిస్తారు. ఇక్కడ 'గాడ్ ఫాదర్' లో మాత్రం తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మెగాస్టార్ గెటప్ ను భిన్నంగా సెట్ చేశారు. ఇది మెగా అభిమానులను బాగానే ఆకట్టుకుంది.
అయితే మాతృకలో మోహన్ లాల్ లుక్ మరియు అతని స్వాగ్ తో పోల్చి చూస్తే మాత్రం.. మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' తో మ్యాచ్ చేయలేకపోయారని పలువురు నెటిజన్లు మరియు వ్యతిరేక వర్గం ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నిజానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'లూసిఫర్' సినిమా తన తండ్రితో చేస్తే బాగుంటుందని రీమేక్ రైట్స్ తీసుకున్నారు. ఆర్బీ చౌదరి - ఎన్వీ ప్రసాద్ భాగస్వామ్యంతో దీన్ని సెట్స్ మీదకు తీసుకొచ్చారు. అనేకమంది దర్శకులను పరిశీలించిన తర్వాత మోహన్ రాజా కు ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు అప్పగించారు. లక్ష్మీ భూపాల్ తో కలిసి స్క్రిప్టులో మన సెన్సిబిలిటీస్ కి తగ్గట్టుగా మార్పులు చేశారు.
భారీ క్యాస్టింగ్ మరియు అగ్రశ్రేణి సాంకేతిక బృందాన్ని ఇందులో భాగం చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను కీలక పాత్రలో నటిస్తుండగా.. నయనతార - సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. నిరావ్ షా సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.
అంతా బాగానే ఉంది కానీ.. మలయాళ రీమేక్ తో చిరంజీవి ఆ మ్యాజిక్ ని రీక్రియేట్ చేయగలరా? అనే సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి. ఫస్ట్ లుక్ చూసిన తర్వాత మోహన్ లాల్ స్వాగ్ ను మ్యాచ్ చేస్తారా అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే కేవలం ఫస్ట్ లుక్ తోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.
మెగాస్టార్ వీరందరికీ సరైన సమాధానం చెబుతాడో లేదో తెలియాలంటే రాబోయే దసరా పండుగ వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే అక్టోబర్ ఫస్ట్ వీక్ లోనే 'గాడ్ ఫాదర్' మూవీ థియేటర్లలోకి రాబోతోంది. చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్ట్ 22న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.