మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. దేవ కట్టాల కాంబోలో వచ్చిన రిపబ్లిక్ మూవీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. కాని సినిమా కమర్షియల్ గా మాత్రం ఆశించినంత సక్సెస్ ను దక్కించుకోలేక పోయింది. రిపబ్లిక్ మూవీలో సాయి ధరమ్ తేజ్ ఐఏఎస్ గా కనిపించిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా విడుదల సమయంలో సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. దాంతో ఆయన సినిమా ప్రమోషన్ లో పాల్గొనలేదు. ఆయన లేకుండానే సినిమాను విడుదల చేయడం జరిగింది. సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది. ఈనెల 26 నుండి ఓటీటీ లో రిపబ్లిక్ మూవీని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాను జీ5 స్టూడియోస్ కొనుగోలు చేసింది. జీ5 ఓటీటీ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది.
ఇప్పటి వరకు ఓటీటీలో సినిమాలు ఎన్నో స్ట్రీమింగ్ అయ్యాయి. కాని ఈ సినిమా చాలా విభిన్నంగా ఉండబోతుందని అంటున్నారు. సినిమా ప్రేక్షకులకు అభిమానులకు ఒక మంచి ఫీల్ ను కలిగించేలా మేకింగ్ వీడియోలను మరియు ప్రతి ఒక్క సన్నివేశంకు సంబంధించిన దర్శకుడి వివరణ ఉండబోతుందట. సినిమాలోని ప్రతి సన్నివేశం తెరకెక్కించే సమయంలో.. రాసుకున్న సమయంలో దర్శకుడి మదిలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఏ ఆలోచనతో అతడు ఆ సన్నివేశాన్ని ఆ సందర్బంగా పెట్టాడు అనే విషయం ప్రేక్షకులకు అర్థం అయితే సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది. కొందరు దర్శకులు ఏదో ఉద్దేశ్యంతో తీసిన సన్నివేశాలు సరిగా అర్థం కావు. ఇప్పుడు రిపబ్లిక్ సినిమాలోని ప్రతి సన్నివేశంను ప్రతి షాట్ ను దర్శకుడు దేవ కట్టా వివరించేందుకు ప్రేక్షకులమ ఉందుకు రాబోతున్నాడు.
జీ5 ఓటీటీ మొట్ట మొదటిసారిగా ఈతరహా ప్రయోగంను చేస్తోంది. కేవలం సినిమా చూడాలనుకున్న వారు సినిమానే చూడవచ్చు.. లేదు ప్రతి సన్నివేశంకు వివరణ కావాలంటే కూడా చూడవచ్చు. రెండు రకాలుగా రిపబ్లిక్ ను జీ5 లో అందుబాటులో ఉంచబోతున్నట్లుగా తెలుస్తోంది. రిపబ్లిక్ సినిమా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కనుక దర్శకుడి వివరణతో చూస్తే మరింత బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ ప్రయోగం కనుక సక్సెస్ అయితే ముందు ముందు రాబోతున్న సినిమాలన్నింటికి కూడా ఓటీటీ లు ఇలా ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. సహజంగా ప్రేక్షకులు మేకింగ్ వీడియోలపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కనుక ఆ తరహా వివరణ.. మేకింగ్ వీడియోలను చూపించడం వల్ల ఖచ్చితంగా మంచి ప్రయోజనం ఉంటుందనే నమ్మకం కొందరు వ్యక్తం చేస్తున్నారు. జీ 5 చేస్తున్న ఈ సరికొత్త ప్రయోగం ఫలితం ఏంటీ అనేది మరి కొన్ని రోజుల్లో తేలిపోనుంది.