ఆషు రెడ్డి.. లెగ్స్ అందాలతో స్టన్నింగ్

రియాలిటీ షో "బిగ్ బాస్" లో పాల్గొన్న తర్వాత ఆమె పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది.

Update: 2024-09-18 13:29 GMT

సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వారిలో ఆషు రెడ్డి ఒకరు. జూనియర్ సమంత అని క్రేజ్ అందుకున్న ఆమె, తన షార్ట్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యింది. ఆషు రెడ్డి తన అందంతోనే కాదు, బోల్డ్ మరియు వినోదాత్మక ప్రదర్శనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. రియాలిటీ షో "బిగ్ బాస్" లో పాల్గొన్న తర్వాత ఆమె పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుండి ఆమెకు ఉన్న క్రేజ్ క్రమంగా పెరుగుతూ వచ్చింది.


తాజాగా, ఆషు రెడ్డి తనకు ఇష్టమైన డ్రెస్ లో తీసుకున్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అవి సెకన్లలోనే వైరల్ అయ్యాయి. ఈ కొత్త లుక్స్ లో ఆమె స్లిమ్ మరియు స్టైలిష్ గా కనిపిస్తూ, ఫ్యాన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఫ్యాషన్ సెన్స్‌తో అమ్మడు లెగ్స్ అందాలతో ఆకట్టుకుంటోంది.


ఫోటోషూట్‌లో ఆమె డ్రెస్ మరియు లుక్స్‌కు మాత్రమే కాకుండా, తన గ్లామర్ షోకు కూడా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పొట్టి డ్రెస్సులో ఉన్న ఆమె లుక్స్, సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించాయి. ఫాలోవర్స్ ఆమె లుక్స్ పై ప్రశంసల జల్లు కురిపించారు. ఒక్క ఫోటోతోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో, ఆమె క్రేజ్ ఏమిటో మరోసారి రుజువు చేసింది.


ఆషు రెడ్డి కేవలం సోషల్ మీడియా స్టార్ మాత్రమే కాదు, సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన ప్రతిభను నిరూపించుకుంది. "చల్ మోహన రంగా"లో సహాయ నటిగా కనిపించిన ఆమె, "బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్" చిత్రంలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం "ఏ మాస్టర్ పీస్" అనే సూపర్ హీరో మూవీతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఆమె చేతిలో ఉన్నాయి. ఆమె ప్రతి సినిమాతో కూడా తన నటనలో కొత్తదనం చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మరి రాబోయే రోజుల్లో అమ్మడు ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News