సోషల్‌ మీడియాలో ఆయుధ పూజ హడావిడి

ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Update: 2024-10-06 14:06 GMT

ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ ఓపెనింగ్స్ ను దక్కించుకున్న ఈ సినిమా వసూళ్లు రూ.500 కోట్లకు చేరువ అయ్యాయి. వీకెండ్‌ పూర్తి అయ్యే వరకు మరింత భారీగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దసరా సెలవులు సినిమాకు కలిసి వస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో మళ్లీ మంచి వసూళ్లు వస్తున్నట్లుగా బాక్సాఫీస్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్‌ సోలో హీరోగా సినిమా రాకపోవడంతో ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. వారికి విందు భోజనం అన్నట్లుగా సినిమా ఉండటంతో భారీ వసూళ్లు నమోదు అయ్యాయి.

దేవర సినిమా విడుదలకు ముందే ఫియర్‌ సాంగ్‌, చుట్టమల్లే, దావుదీ పాటలను విడుదల చేయడం జరిగింది. ఆయుధ పూజ పాటను సైతం విడుదల చేయాలని భావించినా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది. సినిమా విడుదలకు ముందు రోజు ఆయుధ పూజ సాంగ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల తర్వాత ఆ పాటకు మరింత పాపులారిటీ దక్కింది. ఈ మధ్య కాలంలో ఆయుధ పూజ పాట ఎక్కడ చూసినా హడావిడి చేస్తోంది. సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్‌ అవుతున్న ఈ పాటకు ఎక్కువ శాతం మంది ఫ్యాన్స్‌, ప్రేక్షకులు రీల్స్ చేస్తున్నారు. రీల్స్ కి మంచి స్పందన దక్కుతోంది.

ఆయుధ పూజ పాట గురించి మొదటి నుంచి భారీ ప్రచారం జరిగింది. ఆ ప్రచారం కి తగ్గట్లుగానే పాట ఉందని, సినిమాలో ఈ పాట అత్యంత కీలకం అనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్‌ మాస్‌ స్టెప్పులు, చిత్రీకరణ ఇలా ప్రతి ఒక్కటి వావ్‌ అనిపించేంతగా ఉన్నాయి. అందుకే దేవర సినిమా చూసిన ప్రేక్షకులు ఆయుధ పూజ పాటకు వావ్ అంటున్నారు. సినిమాలోనే కాకుండా యూట్యూబ్‌ లోనూ ఈ పాటకు తెగ స్పందన వస్తోంది. పాటలో ఎన్టీఆర్‌ ను చూపించిన తీరుకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు పాటను ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ దేవర సినిమాలో డ్యుయెల్‌ రోల్‌ లో నటించిన విషయం తెల్సిందే. చాలా కాలం తర్వాత ఎన్టీఆర్‌ డ్యుయల్‌ రోల్‌, అది కాకుండా తండ్రి కొడుకులుగా నటించడం ద్వారా ఫ్యాన్స్ కి కన్నుల విందు అన్నట్లుగా నిలిచింది. జాన్వీ కపూర్‌ అందాల ఆరబోత ఫోటోలు సోషల్‌ మీడియాలు ముందే వైరల్‌ అయ్యాయి. సినిమా విడుదల తర్వాత ఆమె అందం గురించి తెగ ప్రచారం జరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌ తో నిర్మించారు. నాగ వంశీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేశారు, యూఎస్‌ లో దాదాపు ఆరు మిలియన్ డాలర్ల వసూళ్లు చేసి సరికొత్త రికార్డ్‌ ను నమోదు చేసింది అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News