బడా నిర్మాతల టార్గెట్ లో మోస్ట్ వైలెంట్ డైరెక్టర్!

మలయాళ సినిమా ఇండస్ట్రీకి మరో క్రేజీ డైరెక్టర్‌ను అందించిన చిత్రం మార్కో. ఈ సినిమా ద్వారా దర్శకుడు హనీఫ్ అదేని తన మార్క్ ఎంత క్రూరంగా ఉంటుందో చూపించాడు.;

Update: 2025-03-20 05:37 GMT

మలయాళ సినిమా ఇండస్ట్రీకి మరో క్రేజీ డైరెక్టర్‌ను అందించిన చిత్రం మార్కో. ఈ సినిమా ద్వారా దర్శకుడు హనీఫ్ అదేని తన మార్క్ ఎంత క్రూరంగా ఉంటుందో చూపించాడు. గతంలో ది గ్రేట్ ఫాదర్, మైఖేల్, రామచంద్ర బాస్ అండ్ కో వంటి సినిమాలతో తన టాలెంట్ చూపించినా, మార్కో మాత్రం అతని రేంజ్ ను మరో లెవెల్ కు పెంచింది. అతి తక్కువ టైమ్‌లోనే ఈ యాక్షన్ థ్రిల్లర్ వంద కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాలో హింసకు అంతుకథా అనేదే లేదు.

దీని వల్లే టీవీలో కూడా ఈ సినిమాను సెన్సార్ కారణాలతో ప్రసారం చేయడానికి ఇబ్బందిగా మారింది. అయినా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే భారీ వ్యూస్ తెచ్చుకుంది. ఇలాంటి దర్శకుడిని ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్థాయిలో టార్గెట్ చేస్తూ నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే అతని పనితీరును మెచ్చుకుని అల్లు అర్జున్ స్పెషల్‌గా ఫోన్ చేసి అభినందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో రెండు అగ్ర నిర్మాణ సంస్థలు అతనితో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

వాటిలో ఒకటి టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ కాగా, మరోకటి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సంస్థ. ఈ ఇద్దరూ హనీఫ్ అదేనితో ఓ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ లైన్‌లో పెట్టారని ఫిలింనగర్ టాక్. ఆ టాలీవుడ్ నిర్మాత మరెవరో కాదు దిల్ రాజు. ఆయన తన ఎస్‌వీసీ బ్యానర్ కాకుండా, తన కూతురు నిర్వహిస్తున్న ప్రొడక్షన్ హౌస్‌లో ఈ సినిమాను నిర్మించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు పెట్టింది పేరైన దిల్ రాజు, ఇంత హింసతో నిండిన దర్శకుడితో పనిచేయడం అంటే షాకింగ్ కు గురి చేసే విషయం.

కానీ ఇదెంతవరకు నిజమో అనేది అధికారిక ప్రకటన వచ్చేదాకా చెప్పలేం. అయితే ఈ మూవీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతుందనే టాక్ నడుస్తోంది. ఇందులో ఇద్దరు అగ్ర కథానాయకులు ఉండబోతున్నారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఇక హనీఫ్ అదేనిపై కన్నేసిన మరో నిర్మాణ సంస్థ కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్. బాలీవుడ్‌లో ఇటీవలే అతను కిల్ అనే చిత్రంతో వయోలెంట్ యాక్షన్ సినిమాల పట్ల తన ప్రేమను ప్రూవ్ చేసుకున్నాడు.

ఇప్పుడు అదే తరహాలో హనీఫ్‌ను కూడా తమ బ్యానర్‌లో సినిమా చేయించాలని చూస్తున్నట్టు టాక్. హిందీ స్టార్ కాస్టింగ్‌తో ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తూ, భారీ బడ్జెట్‌తో రూపొందించాలని కరణ్ జోహార్ భావిస్తున్నారని సమాచారం. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో వేచిచూడాలి. ఇకపై హనీఫ్ అదేని మరింత భారీ స్థాయిలో తన ప్రాజెక్ట్‌లను లాక్ చేసుకుంటే, మార్కో 2 ఆలస్యమవుతుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆ సినిమా అనౌన్స్‌మెంట్ ఎప్పుడొస్తుందో చూడాలి. కానీ దిల్ రాజు, కరణ్ జోహార్ లాంటి టాప్ నిర్మాతలు అతనిని టార్గెట్ చేస్తుండటం మలయాళ డైరెక్టర్లకు నేషనల్ లెవెల్‌లో ఓ కొత్త అవకాశం తెచ్చిపెట్టేలా ఉంది. మరి చివరకు ఈ క్రేజీ దర్శకుడు ఏ బిగ్ ప్రాజెక్ట్‌ను ముందుగా ఓకే చేస్తాడో చూడాలి.

Tags:    

Similar News