చివ‌రి అంకానికి వీర‌మ‌ల్లు..4 రోజులు ఇచ్చేసారా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా `హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు` తెరకెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-03-21 12:29 GMT

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా `హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు` తెరకెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాలుగు రోజులు డేట్లు ఇస్తే షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది? అన్న‌ది ఇంత‌వ‌ర‌కూ ఉన్న స‌మా చారం. ఆయ‌న డేట్లు ఇవ్వ‌డ‌మే ఆల‌స్యం వెంట‌నే చుట్టేయాల‌ని టీమ్ ఎదురు చూస్తుంది. మ‌రి అదెప్పుడు జ‌రుగుతుందో చూడాలి. అయితే షూటింగ్ పూర్త‌యినంత వ‌ర‌కూ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా జ‌రుగు తున్నాయి.


అందుకోసం ప్ర‌త్యేకంగా స‌మ‌యం కేటాయించ‌కుండా చేతిలో ఉన్న స‌మ‌యంలోనే టీమ్ ఆ ప‌నులు ముగించే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఈ నేప‌థ్యంలో వీర‌మ‌ల్లు అభిమానుల‌కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ సినిమా డ‌బ్బింగ్ ప‌నులు మొద‌లైన‌ట్లు మేక‌ర్స్ అధికారికంగా వెల్ల‌డించారు. డ‌బ్బింగ్ స్టార్టెడ్ అంటూ సోష‌ల్ మీడియాలో కి అధికారికంగా ప్ర‌చారం పోస్ట‌ర్ వ‌దిలారు. అలాగే సినిమా రిలీజ్ తేదీనికి కూడా వెల్ల‌డించారు.

మే 9న రిలీజ్ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. వాస్త‌వానికి ఈ నెల 28న చిత్రాన్ని రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ నాలుగు రోజుల షూటింగ్ పెండింగ్ స‌హా డ‌బ్బింగ్ కూడా పూర్తి కాక‌పోవ‌డంతో సాధ్య‌ప‌డ‌లేదు. తాజాగా డ‌బ్బింగ్ ప‌నులు మొద‌లైన నేప‌థ్యంలో ప‌వ‌న్ నాలుగు రోజుల డేట్లు కూడా ఇచ్చి ఉండొచ్చ‌ని తెలుస్తోంది. మార్చి త‌ర్వాత ఏప్రిల్ లో ప‌వ‌న్ డేట్లు ఇచ్చే అవ‌కాశం ఉంది.

ఈ నేప‌థ్యంలోనే రిలీజ్ తేదీ విష‌యంలో మేక‌ర్స్ కూడా ఓ అంచ‌నాకి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ సారి మాత్రం మే9న రిలీజ్ ప‌క్కా అని అభిమానులు గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. మ‌రి ఆ న‌మ్మ‌కాన్ని మేక‌ర్స్ నిల‌బెట్టుకుంటారా? లేదా? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News