బచ్చన్ గాయానికి బాలయ్య మందు!

డైరెక్టర్ హరీష్ శంకర్ కెరీర్ లో ప్రస్తుతం ఎలాంటి దశలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.;

Update: 2025-03-22 06:48 GMT

డైరెక్టర్ హరీష్ శంకర్ కెరీర్ లో ప్రస్తుతం ఎలాంటి దశలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కంటెంట్ ఉన్న దర్శకుడే కానీ అతనికి టైమ్ కలిసి రావడం లేదని అనిపిస్తుంది. కెరీర్ స్టార్ట్ అయ్యి ఏళ్ళు గడుస్తున్నా గబ్బర్ సింగ్ తప్పితే ఆ రేంజ్ ను మరిపించే హిట్టు పడలేదు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గద్దల కొండ గణేష్ లాంటి కమర్షియల్ హిట్స్ ఉన్నా కూడా అవి గబ్బర్ సింగ్ లాంటి హిట్స్ కావు అనే కామెంట్స్ వస్తుంటాయి.

ఈమధ్య కాలంలో తన స్థాయిని నిలబెట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని వంటి యూత్ స్టార్స్‌తో సినిమాలు చేయాలని ట్రై చేశారు కానీ అవి కార్యరూపం దాల్చలేదు. పవన్ కళ్యాణ్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' అంటూ భారీగా హైప్ కలిగించిన ప్రాజెక్ట్ కూడా ఇంకా సగం కూడా ఫినిష్ కాలేదు. ఇక ఈలోగా తీసిన మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అవడంతో ఆయనపై తిరిగి ట్రస్ట్ పెరగాలంటే ఓ కౌంటర్ బ్లాస్ట్ అవసరమే.

ఈ నేపథ్యంలో హరీష్ శంకర్‌కి క్షణాల్లో కాసుల వర్షం కురిపించే గ్యారంటీ ఉన్న హీరో ఎవరు అంటే... మాస్టర్ ఆఫ్ మాస్ బాలకృష్ణనే. ఈ మధ్యకాలంలో బాలయ్య పేరు విన్నా చాలు మాస్ ఆడియెన్స్ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. డైరెక్టర్స్ ట్రాక్ రికార్డ్ ఏమైనా సరే, బాలయ్య సినిమాలకు మాస్ మార్కెట్‌లో ఎనర్జీ దక్కడం ఖాయం. అఖండ, వీరసింహా రెడ్డి, టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ ఇలా ఏదీ తీసుకున్నా బాలయ్య హైప్‌ను తక్కువ అంచనా వేయలేం.

మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ గాయం మానాలి అంటే బాలయ్య హై ఎనర్జిటిక్ మందు పడాల్సిందే. ఇప్పటికే బాలయ్యతో యంగ్ డైరెక్టర్లు చేస్తున్న సినిమాల్ని గమనిస్తే ఇదే టెక్నిక్ పనిచేస్తోందని అర్థమవుతుంది. అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, బాబీ లాంటి హరీష్ తరం దర్శకులు బాలయ్యకు కొత్త మాస్ మేకోవర్ ఇచ్చి హిట్లను సాధించారు. ఒక్కో దర్శకుడు బాలయ్య శైలికి తగిన కొత్త కోణాన్ని తేచాడు. ఇప్పుడు అదే బాటలో హరీష్ శంకర్ కూడా ప్రయాణించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. బాలయ్య స్టామినాను తన స్క్రీన్‌ప్లే పవర్‌తో మేళవించి ఓ మాస్ మెస్మరైజ్ సినిమా ఇవ్వగలగడం హరీష్ శంకర్ కు సాధ్యపడుతుంది.

వాస్తవానికి ఈ కాంబోపై ఇప్పుడే అధికారికంగా ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు. కానీ టాలీవుడ్ సర్కిల్స్ లో వదంతులు ఊపందుకున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్‌కు కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ముందుకొచ్చినట్టు సమాచారం. బాలయ్య ప్రస్తుతం ‘అఖండ-2’ పనుల్లో ఉండగా, ఆ ప్రాజెక్ట్ పూర్తైన వెంటనే హరీష్ సినిమా పట్టాలెక్కే అవకాశముందని టాక్. డేట్స్ క్లియర్ అయితే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News