కీర్తి గ్లామర్ ట్రీట్.. ఈసారి మరింత మెరిసేలా..
ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడం తో పాటు, కీర్తిని స్టార్ హీరోయిన్ గా మార్చేసింది.
టాలీవుడ్ లో 'మహానటి' చిత్రంలో సావిత్రి పాత్రను అద్భుతంగా పోషించి నేషనల్ అవార్డును అందుకున్న మలయాళీ నటి కీర్తి సురేష్, తన కెరీర్ ప్రారంభంలోనే తెలుగులో కొన్ని సక్సెస్ లు సాధించి, స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. 'నేను శైలజ' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కీర్తి, తరువాత 'నేను లోకల్' సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత 'మహానటి' బయోపిక్ లో సావిత్రి పాత్రను నటించడం అనేది ఆమె కెరీర్ లో పెద్ద మైలురాయిగా నిలిచిపోయింది.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడం తో పాటు, కీర్తిని స్టార్ హీరోయిన్ గా మార్చేసింది. ఆ తర్వాత కీర్తి సురేష్ ఫీమేల్ సెంట్రిక్ కథలతో సినిమాలు చేస్తూ, కొంతకాలం వృత్తిపరంగా ముందడుగు వేసింది. కానీ ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. కీర్తి మళ్ళీ కమర్షియల్ సినిమాల వైపు మొగ్గు చూపింది. ఇక కల్కి లాంటి సినిమాల్లోనూ ఆమె ఏదో ఒక విధంగా భాగం అవుతోంది.
ఇక ఆమె సోషల్ మీడియాలో కూడా గ్లామర్ తో మరీంత ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. కీర్తి సురేష్ ఎలాంటి డ్రెస్ లో కనిపించినా కుర్రాళ్ళు ఫిదా అవుతుంటారు. ఇక ఆమె చీర కడితే రెండు కళ్ళు సరిపోవు. రీసెంట్ గా అమ్మడు మరోసారి అందమైన చీరలో కనిపించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. అమ్మడు తన నవ్వుతోనే ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది.
ఇక మహేష్ బాబు తో 'సర్కారు వారి పాట' మరియు నాని తో 'దసరా' లాంటి సినిమాలలో నటించి మళ్లీ కమర్షియల్ హిట్స్ అందుకుంది. ఇటీవల కీర్తి మెగాస్టార్ చిరంజీవి సరసన 'భోళా శంకర్' చిత్రంలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇప్పటివరకు తెలుగులో కొత్త ప్రాజెక్టులు ఒకే చేయని కీర్తి సురేష్, ప్రస్తుతం తమిళ్, మలయాళం, హిందీ భాషలలో నాలుగు సినిమాలు కమిట్ అయి వాటిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది.
కీర్తి హిందీలో కూడా సక్సెస్ సాధించాలనే లక్ష్యంతో ఉంది. ఇంతకుముందు అజయ్ దేవగన్ తో 'మైదాన్' సినిమాలో నటించాల్సిన కీర్తి, ఏజ్ విషయంలో సెట్ కాలేదని ఆ పాత్రకు ప్రియమణి తీసుకున్నారు. హిందీ చిత్రసీమలో సక్సెస్ కోసం 'బేబీ జాన్' అనే చిత్రంలో హీరో వరుణ్ ధావన్ సరసన కీర్తి ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం హిట్టవుతుందని ఆశిస్తూ, బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తోంది.
ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల కోసం కీర్తి సురేష్ తన పెళ్లి కూడా వాయిదా వేసుకున్నట్లు ఆ మధ్య టాక్ వినిపించింది. ఇంట్లో తల్లిదండ్రుల బలవంతం ఉన్నా, కీర్తి ప్రస్తుతం తన దృష్టిని పూర్తిగా సినిమాలపైనే కేంద్రీకరించింది. హిందీ చిత్రసీమలో అవకాశాలు కోసం శ్రద్ధ పెడుతున్న కీర్తి, తెలుగు సినిమాలకు కొంత దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయినా కూడా ఆమె డబ్బింగ్ చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.