ఇళయారాజకి గట్టి షాక్!
సంగీత దిగ్గజం ఇళయరాజా ఔన్నత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంగీతంలో ఆయనో లెజెండ్
సంగీత దిగ్గజం ఇళయరాజా ఔన్నత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంగీతంలో ఆయనో లెజెండ్. ఎన్నో సినిమాలకు సంగీతం అందించి భారతీయ చిత్ర పరిశ్రమలోనే చెరగని ముద్ర వేసారు. ఆయనకంటూ కోట్లాది మంది అభిమానులున్నారు. ఫాలోవర్స్ ఉన్నారు. ఇళయ రాజా ట్యూన్ అంటే ఆ సినిమాకే అందం వచ్చేస్తుంది. పాటతోనే ఎన్నోహిట్లు అందించిన గొప్ప సంగీత దర్శకుడు. దేశ విదేశాల్లో ఎన్నో రకాల కచేరీలు నిర్వహించిన తన బ్రాండ్ ని విశ్వవ్యాప్తం సైతం చేసారు.
తాజాగా ఇళయరాజాపై మద్రాస్ హైకోర్టు కన్నేర జేసింది. పలు రికార్డింగ్ సంస్థలకు తన పాటల్ని వాడుకునే ఒప్పంద గడువు పూర్తయిందని..తనకు హక్కుల్ని ఇప్పించాలని ఇళయరాజా మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. తాజాగా ఈ కేసు విచారణకు రావడంతో హైకోర్టు ఇళయారాజకి గట్టి షాక్ ఇచ్చింది. ఇళయారాజకి వ్యతిరేకంగా ఆయా సంస్థలకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
దేనికైనా కొంత కాలం వరకూ గుడువు ఉంటుందని..ఆ ఫరిది దాటిని తర్వాత హక్కులు ఎవరికీ చెందవని వ్యాఖ్యానించింది. అయితే ఈ తీర్పును పునసమీక్షించాలని ఇళయరాజా తరుపు న్యాయవాధి కోర్టును కోరారు. కానీ కోర్టు పున సమీక్షని కొట్టి పారేసింది. దీనిపై తదుపరి ఎలాంటి విచారణ కూడా అవసరం లేదని వెల్లుబుచ్చింది.
మరి ఈ తీర్పుపై ఇళయరాజా అత్యున్నత న్యాయం స్థానం సుప్రీం కోర్టుకు వెళ్తారా? ఇక్కడితే ఆగిపోతారా? అన్నది చూడాలి. ప్రస్తుతం ఇళయరాజా సినిమాలకంటే విదేశాల్లో ఎక్కువగా కచేరీలు నిర్వహిస్తున్నారు. సినిమా అవకాశాలు కూడా ఇంతకు ముందులా రావడం లేదు. యువన్ శంకర్ రాజా..హ్యారీస్ జైరాజ్ లాంటి వాళ్లు ఫాంలో ఉండటంతో రాజాకి అవకాశాలు తగ్గాయి.